Maha kumbh Mela 2025: నేటి నుంచి మహా కుంభమేళా (Maha kumbh Mela) ప్రారంభం అయ్యింది. ఈ కుంభమేళాకు ఎక్కువగా శివుడు (Sivudu) భక్తులు అయిన నాగ సాదువులు, అఘోరీలు వస్తుంటారు. వీరితో పాటు శివుడి భక్తులు అయిన వారు ఎక్కువగా ప్రయాగ్ రాజ్‌లో (Prayagraj) కనిపిస్తుంటారు. అయితే దేశంలో కూడా ఎక్కువగా శివుని (Sivudu) భక్తులు ఉంటారు. అసలు శివునికి, మహా కుంభమేళానికి, నీటికి ఉన్న సంబంధం ఏంటి? మహా కుంభమేళాకు (Maha kumbh Mela) స్నానం చేయడానికి వెళ్తుంటారు. అది కూడా శివుని భక్తులే ఎక్కువగా వెళ్తుంటారు. అలాగే శివుడికి ఎక్కువగా నీరు ఎందుకు సమర్పిస్తుంటారు? అసలు దీనికి కారణం ఏంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అమృతం పొందడం కోరికతో రాక్షసులు, దేవతలు కలిసి సముద్రాన్ని మథనం చేశారనే కథ మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే దేవతలు, రాక్షసులు మందర పర్వతం మథన రాయిని, వాసుకి సర్ప తాడును ఉపయోగించి సముద్రాన్ని మథనం చేశారు. ఈ సమయంలో ఎవరూ కోరుకోని విషం ముందుగా బయటకు వస్తుంది. ఈ విషం వల్ల మూడు లోకాల మధ్య కోలాహలం ఏర్పడింది. ఆ సమయంలో శివుడు ఈ విషాన్ని సేవించి మూడు లోకాలను రక్షించాడని పురాణాలు చెబుతున్నాయి. పరమ శివుడు విషాన్ని సేవించి తన కంఠంపై ఆపివేయడంతో గొంతు నీలంగా మారింది. ఇక అప్పటి నుంచి శివుడిని నీలకంఠుడు అని కూడా పిలుస్తారు. అయితే శివుడు సేవించిన విష ప్రభావాన్ని తగ్గించడానికి, ప్రతి ఒక్కరూ శివునికి నీరు సమర్పిస్తారు. వీటివల్ల శివుని విషం ప్రభావం తగ్గిందట. అందుకే అప్పటి నుంచి శివునికి నీళ్లతో పండ్లు రసాలు, పండ్లు వంటివి నైవేద్యంగా పెడుతుంటారు.
మహా కుంభమేళకు, శివుడికి ఉన్న సంబంధం ఏంటి?
సముద్ర మథనం నుంచి వెలువడిన విషం కారణంగా భగవంతుడుని విష్ధర్ అని పిలుస్తారు. ప్రతి ఒక్కరిని శివుడు రక్షించినప్పుడే సముద్ర మథనం సాధ్యమైంది. ఆ తర్వాత అమృతం కూడా వచ్చింది. అమృతం కోసం దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన యుద్ధంలో కుండ నుండి కొన్ని చుక్కలు చిమ్మి.. కొన్ని చుక్కలు భూమిపై నాలుగు ప్రదేశాలలో పడ్డాయి. అవే ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని అని నమ్ముతారు. అందుకే అక్కడ మహా కుంభమేళాను నిర్వహిస్తారు. పరమశివుడు విషం తీసుకోవడం వల్ల అమృతం భూమికి చేరగలిగిందని నమ్ముతారు. ఒకవేళ విషంతోనే ఆగిపోయి ఉంటే అమృతం వచ్చేది కాదని శివుడికి ఎక్కువగా పూజిస్తారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.