https://oktelugu.com/

Horoscope Today: ఈ రాశుల వారికి ఈరోజు లక్ష్మీ కటాక్షం.. అన్నీ కలిసి వస్తాయి..

రవియోగం, సిద్ధార్థయోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండనుంది. మరికొన్ని రాశుల వారు శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సందర్భంగా మేషంతో సహా మిగతా రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

Written By:
  • Srinivas
  • , Updated On : November 8, 2024 / 07:35 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై ఉత్తరాషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో రవియోగం, సిద్ధార్థయోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండనుంది. మరికొన్ని రాశుల వారు శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సందర్భంగా మేషంతో సహా మిగతా రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

    మేష రాశి:
    విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.ఆస్తి కొనుగోలు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు.

    వృషభ రాశి:
    కుటుంబంలో ఉన్న విభేదాలు నేటితో తొలగిపోతాయి. కొందరు శత్రువులు ఆధిపత్యానికి ప్రయత్నిస్తారు. కొన్ని నిర్ణయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పిల్లల భవిష్యత్ కోసంకీలక నిర్ణయం తీసుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

    మిథున రాశి:
    సామాజికి సేవా రంగం కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉన్నత విద్యనభ్యసించేరవారికి ఆటంకాలు తొలగిపోతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వ్యాపారులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

    కర్కాటక రాశి:
    ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సబంధాల్లో చీలకలు ఏర్పడుతాయి. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు పెడుతారు.

    సింహారాశి:
    పిల్లల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు ఎక్కువవుతాయి. ఓ శుభకార్యంలో పాల్గొంటారు.

    కన్య రాశి:
    ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఎవరిదగ్గరనైనా అప్పుడు తీసుకుంటే వెంటనే తిరిగి ఇచ్చేయాలి. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. కొన్ని పనుల కారణంగా బిజీగా ఉంటారు. సాయంత్రం స్నేహితులతో సరదాగా ఉంటారు.

    తుల రాశి:
    వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటి వరుక చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులను కలుస్తారు. వ్యాపారాన్ని వేగవంతం చేయడానికి భాగస్వాముల సహకారం తీసుకుంటారు.

    వృశ్చిక రాశి:
    కొన్ని రంగాల వారు మానసికంగా ఒత్తిడికి గురవుతారు. ఉపాధి పొందాలనుకునేవారు కొత్త అవకాశాలను పొందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆర్థికంగా పుంజుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు.

    ధనస్సు రాశి:
    జీవిత భాగస్వామితో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో వ్యాపారం గురించి చర్చిస్తారు. కొన్ని అవసరాల నేపథ్యంలో డబ్బు ఖర్చు అవుతుంది. స్నేహితులతో సరదాగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

    మకర రాశి:
    వ్యాపారులు జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. కుటుంబ అవసరాల కోసం ఖర్చు చరేస్తారు. విద్యార్థులు ముఖ్యమైన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

    కుంభరాశి:
    ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు పెట్టాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

    మీనరాశి:
    కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. రాజకీయాల్లో ఉండేవారికి ఈరోజు అనుకూల సమయం. శారీరక సమస్యలతో బాధపడేవారు. వైద్యులను సంప్రదించాలి.