https://oktelugu.com/

Bigg Boss Telugu 8: పృథ్వీ ఇక నా జీవితంలో లేడు..నామినేషన్ చేస్తా అంటూ రెచ్చిపోయిన విష్ణుప్రియ..చివరికి ఏమైందంటే!

ఇన్ని రోజులు విష్ణుప్రియ హౌస్ ఉండి వృధా, అసలు గేమ్స్ ఆడడం లేదు, ఈమెకి ఆడే సత్తా లేదు అని సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ చేసిన నెటిజెన్స్ కి విష్ణు ప్రియ తన ఆట తీరుతో చెంప దెబ్బ కొట్టింది అనే చెప్పాలి. అంతే కాకుండా పృథ్వీ తనని 'డంబ్' అని అన్నాడని, అతని మీద కోపం తో ఊగిపోయింది

Written By:
  • Vicky
  • , Updated On : November 8, 2024 / 07:45 AM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8:  ఈ వారం మొత్తం విష్ణు ప్రియా చుట్టూనే బిగ్ బాస్ ఎపిసోడ్స్ తిరిగాయి. ప్రతీ టాస్కులోనూ విష్ణుప్రియ తన వైపు నుండి నూటికి నూరు శాతం ఎఫోర్ట్స్ పెట్టి ఆడపులి లాగ రెచ్చిపోయింది. ఈ వారం ఆమె ఆడిన మూడు టాస్కులలో రెండు టాస్కులు కేవలం అదృష్టం కలిసి రాక ఓడిపోయింది. ఇక మూడవ టాస్కులో యష్మీకి హౌస్ మేట్స్ నుండి దొరికిన సపోర్ట్, విష్ణుప్రియ కి దొరకలేదు. ఫలితంగా ఆమె ఓడిపోయింది. ఇన్ని రోజులు విష్ణుప్రియ హౌస్ ఉండి వృధా, అసలు గేమ్స్ ఆడడం లేదు, ఈమెకి ఆడే సత్తా లేదు అని సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ చేసిన నెటిజెన్స్ కి విష్ణు ప్రియ తన ఆట తీరుతో చెంప దెబ్బ కొట్టింది అనే చెప్పాలి. అంతే కాకుండా పృథ్వీ తనని ‘డంబ్’ అని అన్నాడని, అతని మీద కోపం తో ఊగిపోయింది. యష్మీ వద్దకు వెళ్లి ‘అంత పెద్ద మాట అనేసి, నేను బాధపడుతున్నాను అనే ఫీలింగ్ కూడా అతనిలో లేదు. నీతో ఎంతో సంతోషం గా మాట్లాడుతున్నాడు. నాతో మాత్రం మాట్లాడడం లేదు. ఇలాంటి యాటిట్యూడ్ ఉన్నోడు నాకు అసలు వద్దు’ అంటూ చెప్పింది.

    ఆ తర్వాత అప్పుడే అక్కడికి వచ్చిన నిఖిల్ వద్దకు వెళ్లి ‘పృథ్వీ అనే వ్యక్తి ఇక నా జీవితం లో లేడు..అతన్ని నా మైండ్ లో నుండి తీసేస్తున్నాను’ అని చెప్పింది. ఇక్కడ పాపం యష్మీ ఆమెకి సర్దిచెప్పి కలిపే ప్రయత్నం చేసింది, కానీ విష్ణుప్రియ అసలు తగ్గలేదు. ఆమెలో ఈ పౌరుషం కోపాన్ని చూసిన అభిమానులు, ఇప్పటికైనా విష్ణుప్రియ కళ్ళు తెరుచుకుంది. ఇక గేమ్స్ లో తన విశ్వరూపం చూపించేస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ అలా అనుకున్న వాళ్ళందరిని ఫూల్స్ ని చేసేసింది విష్ణుప్రియ. రాత్రి ఆమెనే పృథ్వీ వద్దకు వెళ్ళింది. పృథ్వీ విష్ణు రాగానే ‘నన్ను క్షమించు’ అని అడుగుతాడు. అప్పుడు విష్ణు ‘చూసావా..నేనే నీ దగ్గరికి వచ్చి మాట్లాడాను. నువ్వు మాత్రం నా దగ్గరకి రాలేదు’ అని అంటుంది.

    అప్పుడు పృథ్వీ మాట్లాడుతూ ‘నిజంగా నేను నీకు క్షమాపణలు చెప్తున్నాను.. నీ నిర్ణయాల్లో నేను తలదూర్చకూడదు. నేను నిన్ను డంబ్ అన్నాను కదా, అందుకు కూడా నేను క్షమాపణలు చెప్తున్నాను. నేను ఆ పదాన్ని ఉపయోగించాను అనే విషయం కూడా నాకు గుర్తులేదు’ అని అంటాడు. ఇక ఆ పక్క రోజు విష్ణు ప్రియ కూడా పృథ్వీ కి క్షమాపణలు చెప్తుంది. మళ్ళీ ఇద్దరు ఒక్కటైపోయారు. ఇక ఆ తర్వాత మెగా చీఫ్ ఎవరో తేల్చే టాస్కులో విష్ణు ప్రియ పృథ్వీ కోసం ప్రాణం పెట్టి ఆడింది. ఇదంతా చూస్తుంటే ఈమె పృథ్వీ విషయం లో ఏమి జరిగినా తట్టుకోగలదు, అతను తిట్టినా కొట్టినా కూడా పర్వాలేదు, అతనే కావాలి అనేంత ప్రేమ చూపిస్తుంది. సినిమాల్లో కూడా ఇలాంటి అమర ప్రేమని మనం ఎక్కడా చూసి ఉండమేమో, కేవలం ఈ ఒక్క కారణం వల్లే విష్ణు ప్రియ నేడు టాప్ 5 లోకి వస్తుందా లేదా అనే అనుమానాన్ని అభిమానుల్లో క్రియేట్ చేసింది. లేకపోతే టైటిల్ రేస్ లో ఉండేంత సత్తా ఆమెలో ఉంది అనేది వాస్తవం.