Karthika Masam Jwala Thoranam: హిందూ మాసంలో అత్యంత పవిత్రమైనది కార్తీక మాసం. శివ కేశవులకు అత్యంత ఇష్టమైన ఈ మాసంలో ప్రత్యేక పూజలు చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం పొందవచ్చని అంటుంటారు. అయితే ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి మరింత విశిష్టత ఉందని చెబుతారు. 2025 నవంబర్ 5వ తేదీన కార్తీక పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమి సందర్భంగా చంద్రుడు అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. దీంతో చంద్రుడి కిరణాలు నదులపై పడడం వల్ల ఇందులో స్నానం చేస్తే ఎన్నో జన్మల పుణ్యమని భావిస్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా సకల దేవతలు నదుల్లో కొలువై ఉంటారని.. ఈ సమయంలో కార్తీకదీపం నదిలోకి వదలడం వల్ల ఎన్నో రకాల ఫలితాలు ఉంటాయని చెబుతారు. అయితే కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అసలు జ్వాలాతోరణం నిర్వహించడం వెనుక ఉన్న పురాణ కథ ఏంటి?
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల ఎదుట రెండు కర్రలు కట్టి అడ్డంగా మరొక కట్టే పెట్టి గడ్డితో ఏర్పాటు చేసిన తాడుకు నిప్పంటిస్తారు. ఇలా మండుతున్న జ్వాలా కిందికి వెళ్లి అటు ఇటుగా నడుస్తారు. ఇలా నడవడం వల్ల తమ జీవితంలో ఎన్నో సంతోషాలు ఉంటాయని నమ్ముతారు. అలాగే నరక లోక దారి ప్రవేశం ఉండదని భావిస్తారు. అంతేకాకుండా ఈ జ్వాలాతోరణం నిర్వహించిన తర్వాత సగం కాలిన గడ్డిని పశువులకు ఇవ్వడం ద్వారా వాటి వృద్ధి చెందుతుందని అంటారు.అయితే ఇంతటి విశిష్టతమైన ఈ జ్వాలాతోర వెనుక అనేక పురాణ కథలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి కొన్ని చెప్పుకోవచ్చు.
పురాణాల ప్రకారం త్రిపురసురులను శివుడు సంహరించిన తర్వాత కైలాసానికి చేరుకుంటాడు. ఈ సమయంలో పార్వతి దేవి జ్వాలాతోరణం ఏర్పాటు చేసి ఆహ్వానిస్తుంది. తన భర్తకు దిష్టి పోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అందుకే ఈ జ్వాలాతోరణంకు అంతటి విశిష్టత కలిగింది. ఇది కార్తీక పౌర్ణమి రోజే జరగడంతో పాటు.. త్రిపురలను సంహరించిన రోజు కావడంతో దీనిని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు. మరో కథ ప్రకారం.. క్షీరసము దాన్ని చిలికినప్పుడు ఏర్పడిన విషయాన్ని శివుడు తన కంఠంలో దాచుకుంటాడు. అప్పుడు శివుడని గర్లకంటుడిగా పేర్కొంటారు. ఈ సమయంలో పార్వతీదేవి శివుడితో కలిసి జ్వాలాతోరణం కింద దాటినట్లు చెబుతారు.
కార్తీక పౌర్ణమి రోజు జరిగే మరో విశేషం నదిలో దీపదానం చేయడం. కార్తీక పౌర్ణమి రోజున అన్ని నదులు ఒకే చోట కలుస్తాయని భావిస్తారు. ఇదే సమయంలో సకల దేవతలంతా ఈ నదుల్లో కొలువై ఉంటారని నమ్ముతారు. అందుకే ఈ నదిలో దీపం దానం చేయడం వల్ల అందరి ఆశీస్సులు పొందవచ్చు అని చెబుతారు. నదిలో దీపం వదలడం ద్వారా మరో జన్మ ఉండదని అంటుంటారు. మనుషుల్లోని అహంకారం, చెడు గుణం తొలగిపోవడానికి ఈ దీపదానం ఎంతో ఉపయోగపడుతుందని అంటారు. అందుకే చాలామంది కార్తీక పౌర్ణమి రోజున నదుల్లో దీపాలు వదలడానికి ఇష్టపడుతుంటారు.