Agastya Muni: అగస్త్య ముని గురించి అందరూ కూడా వినే ఉంటారు. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ ప్రాంతంలో ఇతనికి ఓ ఆలయం కూడా ఉంది. వేలాదిమంది ఈ ఆలయాన్ని దర్శించడానికి వెళ్తుంటారు. ఈ ఆలయ చుట్టూ ప్రకృతి ఎంతో సౌందర్యంగా ఉంటుంది. సప్తఋషి ఋషులలో ఒకరైన అగస్త్య ముని క్రమశిక్షణ, జ్ఞానం, భక్తితో ప్రసిద్ధి చెందాడు. వేద సంస్కృతి, జ్ఞానాన్ని వ్యాప్తి చేయడంలో ఇతను ముఖ్యపాత్ర పోషించారు. 4000 సంవత్సరాలు జీవించిన అగస్త్య ముని సాధారణ జీవితం గడిపారని పురాణాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మనం ఎక్కడికైనా వెళ్తే కారు లేదా బైక్ మీద వెళ్తుంటా. కానీ అగస్త్యుడు మాత్రం ఎక్కడికి వెళ్లిన కూడా కాలినడకన వెళ్లేవారట. ఎన్ని వేల కిలోమీటర్లు అయిన కూడా నడుచుకుంటూనే వెళ్లేవారని పురాణాలు చెబుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని రుద్ర ప్రయాగ జిల్లాలో అగస్త్యముని పట్టణంలో ఉన్న ఈ అగస్త్య ముని ఆలయం మందాకిని నది ఒడ్డున ఉంది. చార్ ధామ్ యాత్రకు వెళ్లేవారు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.
అగస్త్య మహర్షి ఇక్కడ తపస్సు చేశాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయ నిర్మాణం సరళ చాలా అందంగా ఉంటుంది. పచ్చని లోయలు, మనోహరమైన పర్వతాల మధ్య ఈ ఆలయం ఉంటుంది. భక్తులకు ఈ ఆలయం పవిత్రమైన ప్రదేశంగా మారింది. అలాగే ఐదుగురు పాండవులు హిమాలయాలకు వెళ్లేటప్పుడు ఈ ఆలయాన్ని సందర్శించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ పూజలు నిర్వహించి వెళ్లారట. అలాగే అగస్త్య మహర్షి శివుడి ఆజ్ఞలను స్వీకరించిన తర్వాత భూమి బరువును సమతుల్యం చేస్తారని మరొక పురాణం చెబుతోంది. అయితే అగస్త్య మహర్షి దేశమంతటా పర్యటించి చివరకు ఈ ప్రాంతంలో స్థిరపడ్డారని ఆయన గుర్తుగానే ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పిలుస్తారు. అగస్త్య ముని ఆలయానికి సమీపంలో మరో కొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి. మక్కు మఠం, ఉఖిమత్ ఆలయం, చోప్తా తుంగనాథ్(మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా, తుంగనాథ్ ఆలయం, ధరి దేవి ఆలయం, త్రియుగి నారాయణ ఆలయం వంటివి ఈ ప్రదేశంలో ఉన్నాయి. ఇక్కడి ప్రకృతి అందాలు చూడటానికి ఎంతో మనోరమంగా ఉంటాయి. చార్ ధామ్ యాత్రకు వెళ్లే వాళ్లు తప్పకుండా ఈ ఆలయాలను సందర్శించండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.