https://oktelugu.com/

IRCTC: మహా కుంభమేళా యాత్ర.. తక్కువ ధరకే ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ!

కుంభమేళాకు వెళ్లడానికి ప్లాన్ చేస్తున్న తెలుగు రాష్ట్రాల భక్తులకు అనువైన సౌకర్యాన్ని అందించడానికి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలో ఎన్నో అధ్యాత్మిక క్షేత్రాలు కూడా ఉన్నాయి. మరి ఈ ప్యాకేజీ ధర ఎంత? ఎన్ని రోజులు? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 11, 2024 / 05:16 AM IST

    IRCTC

    Follow us on

    IRCTC: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ వద్ద మహా కుంభమేళాను నిర్వహిస్తారు. ఈ మహా కుంభమేళా వచ్చే ఏడాది జనవరి 13న ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 26 వరకు జరిగే ఈ కుంభమేళా కోసం ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కుంభమేళాకి ఎందరో జనం వెళ్తారు. ఈ క్రమంలోనే రైల్వే శాఖ ఇటీవల ఎన్నో వేల రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. కుంభమేళాకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు అదనపు రైళ్లను వేయనుంది. ఈ కుంభమేళాకు వెళ్తే ఎన్నో జన్మల పుణ్యఫలం దక్కుతుందని భావించి భారీగా జనం తరలి వెళ్తుంటారు. ఎంతో పవిత్రమైన గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో పుణ్య స్నానం చేస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ క్రమంలో ఇక్కడికి వెళ్లాలని ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు. అయితే ఈ కుంభమేళాకు వెళ్లడానికి ప్లాన్ చేస్తున్న తెలుగు రాష్ట్రాల భక్తులకు అనువైన సౌకర్యాన్ని అందించడానికి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలో ఎన్నో అధ్యాత్మిక క్షేత్రాలు కూడా ఉన్నాయి. మరి ఈ ప్యాకేజీ ధర ఎంత? ఎన్ని రోజులు? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

    మహా కుంభేళాకు వెళ్లేందుకు ఐఆర్‌సీటీసీ మంచి ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం 8 రోజుల పాటు ఉండే ఈ ప్యాకేజీలో వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ పుణ్య క్షేత్రాలు ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి రైలు ప్రారంభం అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల మీదుగా కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వెళ్తుంది. వచ్చే ఏడాది జనవరి 19న సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఈ టూర్ ప్రారంభం అవుతుంది. భువనగిరి, జనగాం, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం వంటి స్టేషన్ల నుంచి ప్రయాణికులు వెళ్లవచ్చు. ఈ టూర్‌కి వెళ్లాలనుకునే వారికి ఒక్కో వ్యక్తి ఛార్జ్ చేస్తారు. అదే ఎకానమీ క్లాస్ అయితే పెద్దలకు రూ.22635, పిల్లలకు రూ.21740 ఉంటుంది. స్టాండర్స్‌లో పెద్దలకు రూ.31145, పెద్దలకు రూ.30095 ఉంటుంది. కంఫర్ట్ అయితే పెద్దలకు రూ.38195, పిల్లలకు రూ.36935 ఛార్జ్ చేస్తారు.

    తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లాలనుకునే వారికి ఈ ప్యాకేజ్ బాగా ఉపయోగపడుతుంది. డే వన్‌ జనవరి 19 న సికింద్రాబాద్ నుంచి ట్రైన్ బయలుదేరుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు స్టేషన్లలో బోర్డింగ్ ఉంది. మీరు దగ్గరగా ఉన్న స్టేషన్‌లో ఎక్కవచ్చు. జనవరి 21వ తేదీకి వారణాసి చేసుకుంటారు. అక్కడ భోజనం చేసి గంగా హారతికి వెళ్తారు. ఆ తర్వాత నాలుగో రోజు రోడ్డు మార్గంలో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లి కుంభమేళాకు వెళ్తారు. అక్కడ అన్ని ఆలయాలు సందర్శించి కుంభ స్నానం చేసి టెంట్ సిటీలో అక్కడ రాత్రి బస చేస్తారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో వారణాసికి వెళ్లి కాశీ విశ్వనాథ దేవాలయం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణా దేవి ఆలయాన్ని సందర్శించి ఆ రాత్రి అక్కడే ఉంటారు. ఆ తర్వాత అయోధ్య చేరుకుని.. శ్రీ రామజన్మ భూమి, హనుమాన్ గర్హిని సందర్శిస్తారు. ఆ రోజు రాత్రి 10 గంటలకు తిరుగు ప్రయాణం మొదలు పెడతారు. మీరు ఈ ప్యాకేజీలో వెళ్లాలనుకుంటే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ముందుగా బుక్ చేసుకోవచ్చు.