https://oktelugu.com/

Raichur : ఈ స్వామివారి విగ్రహంపై వేడినీరు పోస్తే చల్లగా మారుతున్నాయి.. ఆ అలయం ఎక్కడుందో తెలుసా?

కానీ వీటికి ఆధారాలు మాత్రం ఎవరూ చూపలేదు. మరికొందరు మాత్రం ఇది స్వామి వారి మహిమే అని అంటున్నారు. ఏదీ ఏమైనీ ఇది అంతుచిక్కని విషయంగా మారుతుంది.

Written By:
  • NARESH
  • , Updated On : November 29, 2024 / 06:01 AM IST
    Follow us on

    Raichur : భారతదేశం ప్రాచీన ఆలయాలకు నిలయం. ఇక్కడ ఎన్నో పురాతన ఆలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. పూర్వకాలం నుంచి కొందరు రాజులు, గ్రామ పెద్దలు ఆలయాలు నిర్మించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఉండే ఆలయాలు ఊహకందని విధంగా ఉంటాయి. వీటి నిర్మాణం, ఇక్కడ ఆచరించే పద్దతులు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తాజాగా ఓ ఆలయంలోని విగ్రహంపై వేడి నీళ్లు పోయగానే అవి చల్లగా మారుతున్నాయి. అలాగే స్వామి వారి నాభిపై చల్లటి నీళ్లు పోస్తే వేడిగా మారుతున్నాయి. ఇది స్వామి వారి మహిళ అని కొందరు అంటుండగా.. ఆ రాయిలో ఉన్న మూలకాలు బట్టి అలా మారుతున్నాయని మరికొందరు అంటున్నారు. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుంది? దీని విశిష్టత ఏంటిది?

    కర్ణాటక రాష్ట్రంలో ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ త్రయంబకేశ్వర్ ఆలయం ప్రసిద్ధి చెందింది. అలాగే రాయచూర్ జిల్లాలోని డప్పూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర ఆలయానికి వందేళ్ల చరిత్ర ఉంది. అంతకుముందు నుంచే ఉన్న ఈ ఆలయాన్ని 12వ శతాబ్దానికి చెందిన సేవర వంశ రాజు పునరుద్దరించినట్లు చరిత్ర చెబుతోంది. శివుడు, కేశవుడికి ప్రత్యేక ఆలయాలు ఉంటాయి. కానీ శివకేశవులిద్దరూ ఇక్కడ దర్శనమిస్తారు. అయితే ఇద్దరూ మూర్తులు ఉండడం వెనక ఓ చరిత్ర ఉంది.

    స్థానికులు చెబుతున్న ప్రకారం ఈ ఆలయాన్ని శివుడి కోసం నిర్మించారు. గర్భ గుడి ఏర్పాటు చేసి లింగాన్ని ప్రతిష్టించడానికి సిద్ధమయ్యారు. ఇంతలో కేశవుడు సైతం తనకు ఈ ఆలయంలో చోటు కావాలని అడిగాడట. దీంతో శివుడు తనకోసం ఏర్పాటు చేసిన పీఠంపై వేంకటేశ్వర స్వామి ఉండడానికి ఒప్పుకున్నాడట. ఆ తరువాత ఆగస్త్యముని శివలింగాన్ని ప్రతిష్టించారు. ఈ శివలింగంపై ప్రత్యేక గీతలు కనిపిస్తాయి. ఇలా లింగంపై గీతలు ఉండే శివాలయాలు అరుదుగా ఉంటాయి. వీటిలో ఈ ఆలయం ఒకటి. అయితే శివకేశవులు ఇద్దరూ కొలువైన ఈ ఆలయంలో వేంకటేశ్వరుడిని ప్రసన్న వేంకటేశ్వరుడిగా.. శివుడిని ప్రసన్న శివుడిగా పిలుచుకుంటారు.

    శివుడు అభిషేక ప్రియుడు.. వేంకటేశ్వరుడు అలంకార ప్రియుడు.. కానీ ప్రతీ ఆదివారం ఈ ఆలయంలో వేంకటేశ్వరస్వామికి అభిషేకం నిర్వహిస్తారు. ఈ అభిషేకం గురించిప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ స్వామి వారికి వేడినీటితో అభిషేకం చేస్తారు. ఆశ్చర్యమేంటంటే ఆ వేడి నీరు విగ్రహంపై పడగానే అవి చల్లగా మారిపోతాయి. కొన్నేళ్ల కిందట కొందరు స్వాములు ఇక్కడికి వచ్చిన సమయంలో అనుకోకుండా వేడినీటిని తెచ్చి అభిషేకం నిర్వహించారట. దీంతో ఇవి వెంటనే చల్లగా మారడాన్ని గమనించి ఆశ్చర్యపోయారు. అప్పటినుంచి స్వామి వారికి వేడి నీటితో అభిషేకం నిర్వహిస్తున్నారు. అయితే స్వామివారి నాభిపై చల్లటి నీరు పోస్తే అవి వేడిగా మారుతున్నాయి. స్వామి వారి విగ్రహం ప్రత్యేక రాతితో తయారు చేయడం వల్ల ఇలా మారుతున్నాయని కొందరు అంటున్నారు. కానీ వీటికి ఆధారాలు మాత్రం ఎవరూ చూపలేదు. మరికొందరు మాత్రం ఇది స్వామి వారి మహిమే అని అంటున్నారు. ఏదీ ఏమైనీ ఇది అంతుచిక్కని విషయంగా మారుతుంది.