https://oktelugu.com/

Guru Purnima 2024: గురుపౌర్ణమి రోజు గురు పూజతో పాటు ఈ పూజ చేస్తే డబ్బే డబ్బు.. ఎక్కడ, ఎలా చేయాలంటే?

గురువును పూజించే సాంప్రదాయం ఇండియాలో ఎప్పటి నుంచో ఉంది. తమ జీవితం చక్కగా ఉండేందుకు తల్లిదండ్రులతో పాటు గురువుల సాయం కూడా ఎంతో ఉంటుంది. ఇందుకు ప్రతిఫలంగా గురు పౌర్ణమి రోజు తమ జీవితంలో ముఖ్యమైన గురువును ఇంటికి ఆహ్వానించాలి. ముందుగా గురువు పాదాలను శుభ్రం చేయాలి. ఆ తరువాత గురువుకు అతిథి మర్యాదు చేయాలి. చివరకగా అతనిని సంతృప్తి పరిచే బహుమతిని ఇచ్చి సంతోష పర్చాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : July 21, 2024 / 10:52 AM IST

    Guru Purnima 2024

    Follow us on

    Guru Purnima 2024: హిందూ సాంప్రదాయం ప్రకారం.. ఆషాఢ మాసంను శూన్యమాసం అంటారు. ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. కానీ ఈ నెలలో కొన్ని ప్రత్యేక పర్వదినాలు వస్తాయి. ఆషాఢ మాసంలో బోనాల జాతర సాగుతుంది. తెలంగాణలో నెల రోజుల పాటు బోనాల ఉత్సవాలు వైభవంగా సాగుతాయి. ఇదే మాసంలో గురుపౌర్ణమి వస్తుంది. ఆషాడ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని వ్యాప పౌర్ణమి, గురు పౌర్ణమి అని పిలుస్తారు. ఒక వ్యక్తి తన ఎదుగుదలకు సహకరించిన గురువులను ఈరోజు ప్రత్యేకంగా పూజించి గురుతర బాధ్యతను నిర్వహిస్తారు. మరోవైపు గురు పౌర్ణమి కారణంగా ఈరోజు ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ పూజ చేయడం వల్ల కొందరికి వద్దన్నా ధనం వచ్చి చేరుతుంది.. మరి ఆ పూజ విశేషాలేంటో తెలుసుకుందాం.. ప్రతీ ఏడాది ఆషాఢమాసంలో గురు పౌర్ణమి వస్తుంది. ఈ రోజున ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఏడాదిలో గురు పౌర్ణమి జూలైలో జరుపుకుంటున్నారు. గురు పౌర్ణమి రోజున గురువును పూజించాలనే సాంప్రదాయం అనాది కాలం నుంచి వస్తుంది. పూర్వ కాలంలో వేద వ్యాసుడు భారతదేశానికి మహాభారం రూపంలో జ్ఞానాన్ని ప్రసాదించాడు. అందుకు గురుతర బాధ్యతగా వేద వ్యాసుడి పుట్టిన రోజున గురు పౌర్ణమిని నిర్వహిస్తూ వస్తున్నారు. ఎంతో విజ్ఞానం అందించిన గురువులను ఈరోజు పూజించడం వల్ల తృప్తి పొందుతారని అంటారు.

    గురువును పూజించే సాంప్రదాయం ఇండియాలో ఎప్పటి నుంచో ఉంది. తమ జీవితం చక్కగా ఉండేందుకు తల్లిదండ్రులతో పాటు గురువుల సాయం కూడా ఎంతో ఉంటుంది. ఇందుకు ప్రతిఫలంగా గురు పౌర్ణమి రోజు తమ జీవితంలో ముఖ్యమైన గురువును ఇంటికి ఆహ్వానించాలి. ముందుగా గురువు పాదాలను శుభ్రం చేయాలి. ఆ తరువాత గురువుకు అతిథి మర్యాదు చేయాలి. చివరకగా అతనిని సంతృప్తి పరిచే బహుమతిని ఇచ్చి సంతోష పర్చాలి. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తికే కాకుండా గురువు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు.

    గురు పౌర్ణమి రోజున గురువును పూజించడమే కాకుండా దేవుళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈరోజు లక్ష్మీనారాయణుడి అనుగ్రహం కోసం ఆరాధిస్తారు. పసపు రంగులో ఉన్న పూలు, పండ్లు సమర్పించి ఆ స్వామి అనుగ్రహం పొందుతారు. ఇంట్లో వీలు కాకపోతే నారాయణుడు కొలువై ఉన్న ఆలయాలను సందర్శించి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల తమ జీవితంలో ఆనందంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని కొందరు పండితులు చెబుతున్నారు.

    అయితే గురు పౌర్ణమి రోజు ఒక ప్రత్యేక పూజ చేయడం వల్ల వద్దన్నా ధనం వచ్చి చేరుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈ పూజ చేయాలనుకునేవారు ముందుగా రాగి చెంబులో నీళ్లు తీసుకోవాలి. తాము గురువుగా భావించే చిత్రపతాన్ని ఉత్తరం వైపు ఉంచాలి. ఈ చిత్రపటం వద్ద రాగి చెంబును ఉంచి వాటికి పసుపు, కుంకుమ అంటించాలి. ఆ తరువాత ఆ నీళ్లల్లో అక్షింతలు వేయాలి. గంగతీర్థం కూా అందులో వేసి వాటితో పూజ సామనును సంప్రోక్షణ చేయాలి. అక్కడున్న వారు తమ తలపై వీటిని చల్లుకొని ఆ తరువాత నమస్కరించి కొబ్బరికా యకొట్టాలి.

    ఇలా చేయడం వల్ల ఇంట్లో అంతా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో పట్టిందల్లా బంగారమే అవుతుంది. అనుకోకుండా డబ్బు వచ్చి చేరుతుంది. గురు పౌర్ణమి రోజు ఇలా చేసిన వారికి సర్వ దేవతల అనుగ్రహం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.ఇలా చేసిన తరువాత వీలైతే ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించాలి.