Vinayakudi Pooja : వినాయకచవితి ఉత్సవాలు నిన్న ఘనంగా ప్రారంభం అయ్యాయి. దేశ వ్యాప్తంగా వాడవాడలా కొలువైన గణనాథుడికి తొలి రోజు ఘనంగా పూజలు నిర్వహించారు. పలు సంస్థలకు నిన్న సెలవు దినం కావడంతో చాలా మంది వినాయక మండపాళ్ల వద్దే సందడి చేశారు. ఉదయం నుంచి రాత్రి విఘ్నేశ్వరుడు కొలువు దీరే వరకు ఆధ్యాత్మిక వాతావరణంలో ఉన్నారు. మండపాల వద్దనే కాకుండా చాలా మంది ఇళ్లలోనూ చిన్న వినాయక విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిండి వంటలు చేసి ఆ స్వామికి నైవేద్యంగా సమర్పించారు. అయితే కొందరు వారం రోజుల పాటు ఇంట్లోనూ పూజలు చేయడానికి సిద్ధమయ్యారు. మరికొందరు మాత్రం సాయంత్రం నిమజ్జనం చేసిన వారున్నారు. అయితే ఇంట్లో వినాయక విగ్రహం ఉన్నవారు రెండో రోజు పూజ చేయాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..
విఘ్నేశ్వరుడి ఉత్సవాలు దాదాపు 10 రోజుల పాటు కొనసాగుతాయి. ఈ వారం రోజులు రోజుకో పూజను నిర్వహిస్తారు. . మొదటి రోజు 21 పత్రాలతో పూజలు నిర్వహిస్తారు. రెండో రోజు పూజను ఇలా నిర్వహించాలి. భాద్రపద శుద్ధ పంచమి అయిన రెండో రోజు వినాయకుడిని ‘వికట వినాయకుడు’ అని అంటారు. ఈరోజున లంబోదరశ్చ వికటో అని వినాయకుడికి సంబంధించి షోడశ నామాలు స్మరించాలి. ఈరోజు స్వామి వారికి ఆవాహన పూజలు చేయాలి. ఆ తరువాత అటుకుల నైవేద్యాన్ని సమర్పించాలి. రెండో రోజు పూజ చేయడం వల్ల దుష్టకామాన్ని వీడుతారని చెబుతారు.
విఘ్నాలను తొలగించే వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడం వల్ల కష్టాలు తొలగిపోతాయి. పది రోజుల పాటు వినాయకుడికి నిర్వహించే ప్రతీ పూజ ముఖ్యమైనదినగానే చెబుతారు. శుక్రవారం రోజు కుంకుమ పూజ నిర్వహిస్తారు. ఈరోజు పూజలో మహిళలంతా కలిసి పాల్గొంటారు. వినాయక మండపంలో కుంకుమ పూజ చేయడం వల్ల అన్నీ శుభాలే జరుగుతాయని నమ్ముతారు. ఇంట్లో వాళ్లంతా సంతోషంగా ఉండడానికి ఈ పూజ నిర్వహిస్తారు ప్రతీ శుభ కార్యంలో తొలిపూజను వినాయకుడికే చేస్తారు. లక్ష్మీదేవత తనకు పూజలు నిర్వహించే సమయంలో ముందుగా వినాయకుడికి పూజ చేయకపోతే ఆగ్రహం వ్యక్తం చేస్తుందని అంటారు. అలాగే మిగతా దేవతల పూజలు నిర్వహించే సమయంలో వినాయకుడికే ముందు పూజ ఉంటుంది. అలా ముందు పూజ అందుకునే వినాయకుడు వినాయక చవితి నుంచి 10 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకుంటారు.
భక్తులు ఈ పది రోజుల పాటు వినాయక మండపాల వద్ద ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటారు. ప్రతిరోజూ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఉల్లాసంగా ఉంటారు. కుల, మతం లేకుండా ప్రతి ఒక్కరూ వినాయక మండపాల వద్ద కలిసిమెలిసి ఉంటారు. సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తారు. వివిధ రకాల నైవేద్యాలతో లందోదరుడిని ప్రసన్నం చేసుకుంటారు. పది రోజుల పాటు ఘనంగా పూజలు నిర్వహించిన తరువాత నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నిమజ్జనం సందర్భంగా వినాయ విగ్రహాల ఊరేంపు చేస్తూ నృత్యాలు చేస్తారు. ఆ తరువాత గణపతి బప్పా మోరియా అంటూ చెరువులు, వాగుల్లో వినాయక నిమజ్జనం చేస్తారు.