Traffic: ప్రపంచంలో అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ఇక్కడే.. దీన్ని దాటడానికి ఎన్ని రోజులు పట్టిందో తెలిస్తే షాక్ అవుతారు

ఎక్కువ జనాభా ఉండే చైనాలో బీజింగ్ లో అతి పెద్ద ట్రాఫిక్ ఏర్పడింది. 2010లో ఏర్పడిన ఈ ట్రాఫిక్ జామ్ దాదాపు 12 రోజుల పాటు కొనసాగింది. ఒక పది నిముషాల ట్రాఫిక్ జామ్ కే మనకి చాలా చిరాకు వస్తుంది.

Written By: Neelambaram, Updated On : September 7, 2024 10:12 am

Traffic

Follow us on

Traffic: సిటీలో ఉండేవాళ్లకి ఉన్న అతి పెద్ద సమస్య.. ట్రాఫిక్. ఎంత ఫాస్ట్ గా పొద్దున్న లేచి ఆఫీస్ కి పోదాం అనుకున్న సగం టైమ్ ట్రాఫిక్ లోనే అయిపోతుంది. కేవలం పొద్దున్న సాయంత్రంమాత్రమే కాకుండా.. ఏ సమయంలో అయిన కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. చాలా మంది ఆ ట్రాఫిక్ లోనే అన్ని పనులు చేసేస్తారు. ఎక్కడికి అయిన వెళ్తే వెయిట్ చేస్తారు ఏమో కానీ.. ట్రాఫిక్ లో వెయిట్ చేయడం అంటే పెద్ద టార్చర్ లా ఫీల్ అవుతారు.ఈ ట్రాఫిక్ బాధ భరించలేక.. కొందరు బయటకి వెళ్లడానికి కూడా ఇష్టపడరు. సిటీలో ట్రాఫిక్ తో కష్టాలు పడే బదులు గ్రామంలో ఉండటం బెటర్ అని చాలా మంది ఫీల్ అవుతుంటారు. అయితే మెట్రో సిటీస్ లో ఎల్లప్పుడూ ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. అందులో పండగలు వస్తే ఇక అన్ని హైవే రోడ్లు వాహనాలతో నిండిపోతాయి. ఇదిలా ఉండగా ప్రపంచంలో అతి పెద్ద ట్రాఫిక్ జామ్ గురించి విన్నారా? వింటే తప్పకుండా షాక్ అవుతారు. ప్రపంచం లోనే అతి పెద్ద ట్రాఫిక్ జామ్ ఉంది. అది ఎన్ని రోజులో తెలిస్తే.. ఆశ్చర్యపడతారు. ఇంతకీ ప్రపంచంలో అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ఎక్కడ ఏర్పడిందో తెలుసుకుందామా.

ఎక్కువ జనాభా ఉండే చైనాలో బీజింగ్ లో అతి పెద్ద ట్రాఫిక్ ఏర్పడింది. 2010లో ఏర్పడిన ఈ ట్రాఫిక్ జామ్ దాదాపు 12 రోజుల పాటు కొనసాగింది. ఒక పది నిముషాల ట్రాఫిక్ జామ్ కే మనకి చాలా చిరాకు వస్తుంది. అలాంటిది 12 రోజులు అంటే మీరే ఉహించుకోవచ్చు. ఈ ట్రాఫిక్ జామ్ దాదాపుగా 100 కిలోమీటర్ల వరకు సాగింది. రోజులో కేవలం ఒక కిలో మీటర్ మాత్రమే వాహనాలు నడిచేవి. ప్రయాణికులు ఆ ట్రాఫిక్ జామ్ లోనే 12 రోజులు పాటు ఉన్నారు. వాహనాన్ని ఇల్లు అనుకుని అందులోనే భోజనం అన్ని చేయడం మొదలు పెట్టారు. ఈ ట్రాఫిక్ కి కొందరు నీరు, ఫుడ్ ని అధిక ధరకి అమ్మడం మొదలుపెట్టారు. కొందరు ఆకలికి తట్టుకోలేక కొన్నారు. కానీ మరికొందరు ఇంత రేటు పెట్టి కొనడం వేస్ట్ అని కొనలేదు. అలా ఆకలితోనే ఉండిపోయారు.

వందల కిలోమీటర్లు ఇలా ట్రాఫిక్ నిలిచిపోవడానికి ఓ కారణం ఉంది. రాజధాని బీజింగ్‌కు సమీపంలో ఉన్న బీజింగ్, టిబెట్ హైవేపై కొన్ని పనులు అవుతున్నాయి. దీంతో రహదారిపై భారీ ట్రక్కులు సగం రోడ్ ని ఆక్రమించాయి. ఇలా రోడ్ మొత్తం బ్లాక్ అయ్యింది. ఆ తరువాత 12 రోజులకి ఈ ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కొత్త వాహనాలను వదలేదు. మొత్తం రవాణాను ఆపేసారు. దీంతో చివరికి ట్రాఫిక్ క్లియర్ అయ్యింది.