Horoscope Today:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 ఫిబ్రవరి 21న ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. బుధవారం చంద్రుడు కర్కాటక రాశిలో సంచరించనున్నాడు. దీంతో ఓ రాశివారికి పూర్వీకుల ఆస్తి సొంతమవుతుంది. మరి కొన్ని రాశుల వారి ఇంట్లో ఆహ్లదకరమైన వాతావరణం ఉంటుంది. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి. ఓ సమాచారం నిరాశను కలిగిస్తుంది. ఆన్ లైన్ లో పనిచేసే వారికి భారం పెరుగుతుంది.
వృషభ రాశి:
ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాలయాలకు హాజరు కావొచ్చు. పాత బకాయిలు చెల్లిస్తారు. ప్రయాణాలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది.
మిధునం:
అనుకూల ఫలితాలు ఉంటాయి. విహార యాత్రలకు వెళ్తారు. కుటుంబంలో ఆహ్లదకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు అనుకూల వాతావరణం. వ్యాపారులకు పెట్టుబడులు లాభిస్తాయి.
కర్కాటకం:
ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. గతంలో పెండింగులో ఉన్న సమస్యలను పరిష్కరిస్తారు. పూర్వీకుల ఆస్తి సొంతమవుతుది. కొత్త వ్యాపారం ప్రారంభించేవారికి అనుకూల సమయం.
సింహ:
అనుకున్న పనులు నెరవేరుతాయి. జీవిత భాగస్వామితో ప్రేమగా ఉంటారు. కొన్ని వాగ్దానాలను నెరవేరుస్తారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలను చేసుకుంటారు.
కన్య:
వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. పెండింగులో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థుల కెరీర్ కు సంబంధించిన శుభవార్తలు వింటారు.
తుల:
ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారు. ఉద్యోగులు కార్యాలయాల్లో ప్రశాంతంగా ఉంటారు.
వృశ్చికం:
రాజకీయాల్లో పనిచేసేవారికి అనుకూలం. పాత సమస్యలను పరిష్కరించుకుంటారు. శుభకార్యాలయ వల్ల ఇంట్లో వాతావరణం ఆహ్లదంగా ఉంటుంది.
ధనస్సు:
ఎక్కువగా వాదనలు చేయొద్దు. ఉద్యోగులు తోటివారితో జాగ్రత్తగా ఉండాలి. విహార యాత్రకలు వెళ్లేవారు విలువైన వస్తువులపై జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
మకర:
ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మానసిక భారం నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. వివాహం చేసుకోవాలనుకునేవారికి అడ్డంకులు తొలగిపోతాయి.
కుంభం:
అనుకున్న పనులు పూర్తి కాకపోవడంతో నిరాశతో ఉంటారు. కొందరి నుంచి శుభవార్తలు వింటారు. ఎవరికైనా అప్పు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువ.
మీనం:
కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అనుభవం ఉన్న వ్యక్తి నుంచి సలహాలు తీసుకోవాలి. ఆస్తి సంబంధించిన వివాదాలు ఉంటాయి. కొన్ని పనుల కోసం ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.