Horoscope Today:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 ఫిబ్రవరి 14న ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో ఓ రాశివారికి ఊహించని ఫలితాలు ఉంటాయి. మరో రాశివారికి ఆకస్మిక ధన లాభం ఉంటుంది. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
వ్యాపారులు కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటించాలి. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు చేస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది.
వృషభ రాశి:
కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రావొచ్చు. కష్టపడిన వారికి అధికంగా ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు.
మిథునం:
ఉద్యోగస్తులు కొన్ని శుభవార్తలు వింటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. వ్యాపారులకు ఊహించని ఫలితాలు ఉంటాయి.
కర్కాటకం:
ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుల్లో ఒకరు సాయం చేస్తారు. షాపింగ్ కోసం ఖర్చులు చేస్తారు. గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి.
సింహ:
కుటుంబ సభ్యులతో వాగ్వాదం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. విదేశీ వ్యాపారం చేయాలనుకునేవారు శుభవార్తలు వింటారు. కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి.
కన్య:
ఉపాధి కోసం ఎదురుచూసేవారు శుభవార్తలు వింటారు. దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న సమస్యలను పరిష్కరిస్తారు. ఆస్తులు కొనుగోలు చేయాలనుకునేవారికి అనుకూల వాతావరణం.
తుల:
తల్లిదండ్రుల ఆశీర్వాదంతో కొన్ని పనులు సక్సెస్ అవుతాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక లాభం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
వృశ్చికం:
జీవిత భాగస్వామి సపోర్టుతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూల వాతావరణం.
ధనస్సు:
ప్రియమైన వ్యక్తులతో సంతోషంగా ఉంటారు. ఊహించనిదాని కంటే ఎక్కువ లాభం పొందుతారు. ఇతరులకు ఆర్థిక సాయం చేస్తారు. వ్యాపారం చేసేవారు సంతోషంగా గడుపుతారు.
మకర:
కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారికి ఈరోజు అనుకూలం. వివాహం చేసుకోవాలనుకునేవారికి కొత్త ప్రతిపాదనలు వస్తాయి. కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు.
కుంభం:
కొన్ని విషయాల్లో ఓపిక అవసరం. జీవిత భాగస్వామితో ఎక్కువగా వాదనలు చేయకపోవడమే మంచిది. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దీంతో సమాజంలో గౌరవం పెరుగుతుంది.
మీనం:
తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. శత్రువులు మీపై ఆధిపత్యానికి యత్నిస్తారు. వ్యాపారులు సంతోషంగా ఉంటారు. పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.