https://oktelugu.com/

Horoscope Today: ఈ రాశుల వారికి ఈరోజు అనుకోని అదృష్టం.. లక్ష్మీదేవి కటాక్షం పొందినట్లే..

కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయినా భయపడకుండా అనుకున్న పనులు పూర్తి చేయాలి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇతరుల వాగ్వాదాల్లో జోక్యం చేసుకోకూడదు. స్నేహితులు ధనసాయం చేస్తారు.

Written By:
  • Srinivas
  • , Updated On : January 7, 2025 / 08:08 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today:ద్వాదశ రాశులపై మంగళవారం రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో సిద్ధ యోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకోకుండానే అదృష్టం వరించనుంది. మరికొన్ని రాశుల వారు మాత్రం కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) :ఈ రాశి వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే ఇదే మంచి సమయం. విదేశాల్లో చదివే విద్యార్థుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగులు ఆశించిన ఫలితాలు పొందుతారు.

    వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు పేదలకు సాయం చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

    మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయినా భయపడకుండా అనుకున్న పనులు పూర్తి చేయాలి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇతరుల వాగ్వాదాల్లో జోక్యం చేసుకోకూడదు. స్నేహితులు ధనసాయం చేస్తారు.

    కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఆర్థిక వ్యవహారాలు జరిపేవారు జాగ్రత్తగా ఉండాలి. ఒకరిని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోకూడదు. కోర్టు వివాదాలు ఉంటే నేటితో పరిష్కారం అవుతాయి.

    సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఏ పని చేసినా ఉత్సాహంగా చేస్తారు. కెరీర్ పరంగా మంచి పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. కొన్ని పనుల పట్ల నిర్లక్ష్యాన్ని వీడాలి. అనవసరంగా కోపం తెచ్చుకోవద్దు.

    కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఉద్యోగులు కార్యాలయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అదనపు ఆదాయం పొందేందుకు మార్గం ఏర్పడుతుంది. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టాల్సి వస్తే ఇతరుల సలహా తీసుకోవాలి.

    తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఏదైనా పనిమొదలు పెట్టాలనుకుంటే ఇదే మంచి సమయం. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి.

    వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : కొన్ని పనుల నిమిత్తం ఈరోజు బీజీగా ఉంటారు. కుటుంబ సభ్యుల కోసం సమయాన్ని కేటాయించాలి. ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారులు కొత్త పనిని ప్రారంభించేందుకు ముందుకు వస్తారు.

    ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : వ్యాపారులు కొత్త ఒప్పందాన్ని చేసుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. అయితే ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కొత్త పెట్టుబడులు పెడుతారు.

    మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులు పెద్ద ఎత్తున లాభాలు పొందుతారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి.

    కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : చాలా విషయాల ద్వారా సంతోషాన్ని పొందుతారు. రోజూవారీ అవసరాలకు ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతున్నా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది.

    మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఉంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. స్నేహితులతో సంతోషంగా ఉంటారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.