Meenakshi Chaudhary : ఇటీవల కాలం లో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొత్త హీరోయిన్స్ లో మీనాక్షి చౌదరి కి ప్రస్తుతం ఏ రేంజ్ లో అవకాశాలు వస్తున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఆమె నటిస్తున్న సినిమాలలో సక్సెస్ రేట్ చాలా తక్కువ, అయినప్పటికీ కూడా అవకాశాలు క్యూలు కడుతున్నాయి. ఇప్పటి వరకు ఆమె చేసిన సినిమాలలో కేవలం ‘హిట్ 2 ‘, ‘లక్కీ భాస్కర్’ చిత్రాలు మాత్రమే సూపర్ హిట్ అయ్యాయి. గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన తమిళ హీరో విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ చిత్రానికి కూడా నెగటివ్ రివ్యూస్ వచ్చాయి. కానీ విజయ్ కి ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. ఇందులో హీరోయిన్ గా నటించిన మీనాక్షి చౌదరి పై తమిళ ఆడియన్స్ మామూలు రేంజ్ లో ట్రోల్స్ చేయలేదు.
దీని గురించి ఆమె రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్తూ ‘గత ఏడాది నాకు ఒకేసారి సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’, తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ చిత్రాలలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది. ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే అంత పెద్ద సూపర్ స్టార్స్ సినిమాల్లో అవకాశం రావడం అదృష్టం గా భావించాను. కానీ విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ చిత్రంలో నా నటనకు గాను విపరీతమైన ట్రోల్స్ పడ్డాయి. ఆ ట్రోల్స్ ని చూసి నేను వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసాను. కొంతకాలం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను’ అంటూ చెప్పుకొచ్చింది మీనాక్షి చౌదరి. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. చూసేందుకు అందంగా ఉండే ఈ అమ్మాయికి పాత్రలు మాత్రం సరైనవి తగలడం లేదు అనేది వాస్తవం.
ఇకపోతే అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో మీనాక్షి చౌదరి ఒక హీరోయిన్ గా నటించింది. ఇందులో ఆమె వెంకటేష్ కి మాజీ ప్రేయసి గా నటించింది. ఈ చిత్రం ప్రొమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె పై విధంగా వ్యాఖ్యానించింది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం లో నేను కామెడీ చేసానని, యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించాను అంటూ చెప్పుకొచ్చింది. నా డ్రీం రోల్ మంచి యాక్షన్ మూవీ లో ఫైట్స్ చేయాలని, ఆ డ్రీం ఈ చిత్రంతో నెరవేరింది అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఈ చిత్రం లో మీనాక్షి చౌదరి తో పాటు ఐశ్వర్య రాజేష్ కూడా హీరోయిన్ గా నటించింది. ఇందులో ఈమె వెంకటేష్ కి భార్య గా నటించింది. ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ పాటకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది, సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.