https://oktelugu.com/

Horoscope Today: శివయోగం కారణంగా ఈరోజు ఈ రాశుల వ్యాపారులకు అనుకోని ఆర్థిక ప్రయోజనాలు..

వ్యాపారులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. సాయంత్రం ఇంటికి అతిథులు రావడంతో సందడిగా మారుతుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. కొన్ని శుభకార్యాలు జరగవచ్చు. కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 7, 2024 / 08:08 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు ద్వాదశ రాశులపై పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు సింహ రాశిలో సంచారం చేయనున్నాడు. బుధవారం శివయోగం ఏర్పడనుంది. ఈ కారణంగా కొన్ని రాశుల వారి ఇంట్లో లక్ష్మీతాండవం చేస్తుంది. మరికొన్ని రాశుల వారు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    వ్యాపారులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. సాయంత్రం ఇంటికి అతిథులు రావడంతో సందడిగా మారుతుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. కొన్ని శుభకార్యాలు జరగవచ్చు. కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు.

    వృషభ రాశి:
    అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. పిల్లల కోసం బహుమతులు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. కొన్ని విషయాల్లో డబ్బు ఖర్చు అవుతుంది.

    మిథున రాశి:
    సాయంత్రం ఇంటికి అతిథులు రావొచ్చు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ రంగాల్లో ఉన్న వారికి ఆందోళనతో ఉంటారు. ఎంతోకాలంగా పెండింగులో ఉన్న సమస్యలు నేటితో పరిష్కరిస్తారు. జీవిత భాగస్వామి కోసం బహుమతిని కొనుగోలు చేస్తారు.

    కర్కాటక రాశి:
    ఉద్యోగులు కొన్ని లక్ష్యాలను పూర్తి చేస్తారు. వ్యాపారులకు అడ్డంకులు తొలగిపోతాయి. జీవిత భాగస్వామి కోసం ఓ బహుమతి కొనుగోలు చేస్తారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. రాజకీయ రంగాల్లో ఉన్న వారికి పురోగతి లభిస్తుంది.

    సింహారాశి:
    ఉద్యోగులు కార్యాలయంలో స్థాన చలనం ఉంటుంది. ఏదైనా పని చేసేటప్పుడు తొందరపడొద్దు. పెండింగ్ బకాయిలు ఉంటే ఇప్పుడు వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. కుటుంబ జీవితం గందరగోళంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువ.

    కన్య రాశి:
    రాజకీయ రంగాల్లో ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం తీవ్రంగా శ్రమిస్తారు. ఏ నిర్ణయం తీసుకున్నా.. ఆలోచనాత్మకంగా ఉండాలి. ఆస్తి విషయంలో శుభవార్త వింటారు. పెద్దల సహకారంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగులు కొన్ని విషయాల్లో నష్టపోవాల్సి వస్తుంది.

    తుల రాశి:
    వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకోవాల్సి వస్తుంది. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఏదైనా పని ప్రారంభించాలనుకుంటే ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మార్కెటింగ్ తో సంబంధం ఉండే వ్యక్తులు లాభాలు పొందుతారు.

    వృశ్చిక రాశి:
    సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండొద్దు. పిల్లల విషయంలో ఆందోళనతో ఉంటారు. వివాహితులు కొన్ని శుభవార్తలు వింటారు. శత్రవులపై ఆధిపత్యం చెలాయిస్తారు. వివాహ ప్రయత్నాలకు సంబంధించి శుభవార్తలు వింటారు.

    ధనస్సు రాశి:
    ఈరోజు ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని పత్రాలను ఎట్టి పరిస్థితుల్లో మరిచిపోకుండా ఉండాలి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారులకు అధిక లభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో వివాదం ఉంటుంది. కొన్ని రంగాలకు చెందిన వారు తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటారు.

    మకర రాశి:
    సామాజిక రంగాల్లో ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలి. బంధువుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. రాజకీయాల్లో ఉన్న వారికి కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. విద్యార్థులు భవిష్యత్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

    కుంభరాశి:
    సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం బహుమతిని కొనుగోలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే వెంటనే చెల్లించడం మంచిది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు.

    మీనరాశి:
    ఉద్యోగులు కొన్ని శుభవార్తలు వింటారు. ప్రత్యర్థులతో ఇబ్బందులు ఏర్పడుతాయి. అందువల్ల ఆలోచనాత్మకంగా వ్యవహరించాలి. సాయంత్రం కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు సోదరుల మద్దతు ఉంటుంది. ఆధ్యాత్మిక వాతావరణంలో గడుపుతారు.