https://oktelugu.com/

Horoscope Today: ఈ రాశి వ్యాపారులు డబ్బు హామీ విషయంలో జాగ్రత్త.. ఎందుకంటే?

మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగులు కొన్ని విజయాలు అందుకుంటారు. ప్రయాణాలకు దూరంగా ఉండాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : October 28, 2024 / 07:57 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై ఉత్తర పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు ఇంద్ర యోగం ఏర్పడనుంది. ఈకారణంగా కొన్ని రాశులపై శివుని అనుగగ్రహం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి.మరికొందరు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటారు. మేషంతో సహా మొత్తం 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    ఈ రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారులకు అంతంతమాత్రంగానే లాభాలు ఉంటాయి. తెలియని వివాదాల జోలికి వెళ్లకూడదు. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి. శత్రువులతో జాగ్రత్త.

    వృషభ రాశి:
    మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగులు కొన్ని విజయాలు అందుకుంటారు. ప్రయాణాలకు దూరంగా ఉండాలి.

    మిథున రాశి:
    పెండింగ్ పనులు పూర్తి చేయడంలో కృషి చేస్తారు. ఉద్యోగుతు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. కొన్ని నిర్ణయాలు తీసుకునే సమయంలో పెద్దల సలహా తీసుకోవాలి.

    కర్కాటక రాశి:
    వ్యాపారులకు పురోగతి ఉంటుంది. డబ్బు హామీ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

    సింహారాశి:
    ముఖ్యమైన విషయాలు కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. వ్యాపారులు అనుకున్న విజయాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శారీరకంగా కష్టాన్ని ఎదుర్కొంటారు కొందరు వ్యక్తులతో గొడవలు ఏర్పడే అవకాశం.

    కన్య రాశి:
    వ్యాపారులు సమస్యలు ఎదుర్కోవాల్సివస్తుంది. శత్రువుల ఎత్తులపై కన్నేసి ఉంచాలి. ఉద్యోగలు తోటివారితో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని కారణాల వల్ల ఆదాయం పెండింగ్ లో పడుతుంది.

    తుల రాశి:
    కొన్ని నిర్ణయాలు కీలకంగా మారుతాయి. కటుుంబ సభ్యుల కోసం సమయాన్ని వెచ్చిస్తారు. మానసికంగా చికాగుతో కలిగి ఉంటారు. ఉద్యోగులు సీనియర్ల నుంచి వేధింపులు ఎదుర్కొంటారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.

    వృశ్చిక రాశి:
    వ్యాపార కార్యకలాపాల్లో బిజీగా ఉంటారు. బ్యాంకు రుణం పొందుతారు. ఆర్థికంగా పుంజుకుంటారు. ఇంటిసామాగ్రి కోసం ఖర్చులు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులతో దూరంగా ఉండాలి.

    ధనస్సు రాశి:
    వ్యాపారులు కొంత నష్టానని ఎదుర్కోవాల్సి వస్తుంది. పొరపాటున కూడా వాగ్వాదం చేయొద్దు. సాయంత్రం సమయంలో స్నేహితులను కలుస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. అనుకోని ప్రయాణాలు ఉంటాయి.

    మకర రాశి:
    ఇంట్లో కొన్ని పనులను పూర్తి చేయడానికి శ్రద్ధ చూపుతారు. ఉద్యోగులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. శత్రువులు మీపై ఆధిపత్యానికి ప్రయత్నిస్తారు.

    కుంభరాశి:
    వ్యాపారులకు ఊహించని ఫలితాలు వస్తాయి. కొన్ని పెట్టుబడులకు దూరంగా ఉండాలి. వాదనల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు చిక్కుల్లో పడుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

    మీనరాశి:
    సీనియర్ల నుంచి సలహా ద్వారా కొత్త పెట్టుబడులు పెట్టాలి. ఉద్యోగులు అనుకున్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబ సభ్యుల కోరిక మేరకు కొన్ని పనులు పూర్తి చేస్తారు.