Bigg Boss Telugu 8: ఆడియన్స్ ఓటింగ్ తో సంబంధం లేకుండా ఇది మూడవ ఎలిమినేషన్..మెహబూబ్ ని బయటకి పంపడానికి కారణం అదేనా?

మానసిక ఒత్తిడి ని తట్టుకోలేక అతనే సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. ఇతను వెళ్ళేటప్పుడు కనీసం AV వీడియో కూడా వేయకపోవడం గమనార్హం. ఓటింగ్ పరంగా చూస్తే ఇతని రేంజ్ టాప్ 3 లో ఉండేది. కానీ అలా తనకి తాను ఎలిమినేట్ అవ్వడం ఎవరికీ నచ్చలేదు.

Written By: Vicky, Updated On : October 28, 2024 8:11 am

Bigg Boss Telugu 8(167)

Follow us on

Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ షోలో ఆడియన్స్ ఓట్లతో సంబంధం లేకుండా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. రెండవ వారం నామినేషన్స్ లోకి వచ్చిన శేఖర్ బాషా ఎలిమినేషన్ కూడా అలాగే జరిగింది. ఆడియన్స్ ఓటింగ్ లో ఆయన సేఫ్ అయ్యినప్పటికీ, తన భార్య ని చూడాలి అని బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేయడంతో ఆయన్ని పంపేశారు. ఇది ఆడియన్స్ కి చాలా అన్యాయమైన ఎలిమినేషన్ అని అనిపించింది. ఇక ఆ తర్వాత ఆడియన్స్ ఓటింగ్ తో సంబంధం లేకుండా ఎలిమినేట్ అయిన మరో కంటెస్టెంట్ నాగ మణికంఠ. మొదటి వారం నుండి ఈయన ప్రతీ వారం నామినేషన్స్ లో ఉండేవాడు. కానీ ఆడియన్స్ ఇతన్ని సేవ్ చేస్తూ వచ్చారు. చివరి వారం లో కూడా ఆడియన్స్ అతన్ని సేవ్ చేసారు.

కానీ మానసిక ఒత్తిడి ని తట్టుకోలేక అతనే సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. ఇతను వెళ్ళేటప్పుడు కనీసం AV వీడియో కూడా వేయకపోవడం గమనార్హం. ఓటింగ్ పరంగా చూస్తే ఇతని రేంజ్ టాప్ 3 లో ఉండేది. కానీ అలా తనకి తాను ఎలిమినేట్ అవ్వడం ఎవరికీ నచ్చలేదు. గత సీజన్ లో శివాజీ కూడా సెల్ఫ్ ఎలిమినేషన్ కోసం బిగ్ బాస్ ని చాలా రిక్వెస్ట్ చేసాడు. కానీ నాగార్జున, బిగ్ బాస్ అతనికి నచ్చజెప్పి షో లో కొనసాగేలా చేసారు. కానీ మణికంఠ విషయంలో మాత్రం అసలు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇది ఇలా ఉండగా మెహబూబ్ నిన్ననే ఎలిమినేట్ అవ్వడం మనమంతా చూసాము. టాస్కులు బాగానే ఆడుతున్నాడు, ఇతనికి ఓట్లు ఎందుకు పడలేదు అని చాలా మంది అనుకున్నారు. కానీ వాస్తవానికి ఇతనికి ఓట్లు బాగానే పడ్డాయట. టాప్ 3 రేంజ్ లో అసలు లేడు కానీ, ఎలిమినేట్ అయ్యే రేంజ్ తక్కువ ఓట్లు పడలేదని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

కానీ మెహబూబ్ ని షో మంచి కోసమే ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తుంది. కొద్దిరోజుల క్రితమే ఆయన నభీల్ తో తమ కమ్యూనిటీ ఓటింగ్ గురించి చర్చలు జరపగా, అది సోషల్ మీడియాలో నేషనల్ లెవెల్ లో ఎలా ట్రెండ్ అయ్యిందో మనమంతా చూసాము. తెలుగు బిగ్ బాస్ హౌస్ లో కమ్యూనిటీ గురించి చర్చలు అంటూ నేషనల్ మీడియా కథనాలు ప్రచారం చేసింది. దీంతో బిగ్ బాస్ షో పై నెగటివిటీ బాగా పెరిగింది. నభీల్, మెహబూబ్ ని ఎలిమినేట్ చెయ్యాలి అంటూ పెద్ద ఎత్తున ట్రెండింగ్ చేసారు నెటిజెన్స్. నాగార్జున దీనిపై వాళ్ళిద్దరిని బలంగా కడిగిపారేయాలి అంటూ డిమాండ్ కూడా వినిపించింది. కానీ నేషనల్ టీవీ ఛానల్ లో పబ్లిక్ గా కమ్యూనిటీ గురించి చర్చలు పెట్టడం చట్ట రీత్యా నేరం కాబట్టి నాగార్జున ఆ పని చేయలేదు. పరోక్షంగా వార్నింగ్ ఇచ్చి, మెహబూబ్ ని ఒక స్ట్రాటజీ ప్రకారం ఈ వారం ఎలిమినేట్ చేశారట బిగ్ బాస్ టీం.