Horoscope Today: 2024 ఏప్రిల్ 1న ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈనేపథ్యంలో సోమవారం మేష రాశి ఉద్యోగులు పనిభారాన్ని ఎదుర్కొంటారు. అలాగే 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఉద్యోగులు కార్యాయాల్లో సమస్యలు ఎదుర్కొంటారు. వివిధ మార్గాల నుంచి డబ్బు అందుతుంది. కొన్ని అవసరాల నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
వృషభ రాశి:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా వాదనలు చేయొద్దు. పాత స్నేహితులను కలుస్తారు.
మిథునం:
ఇతరులకు సాయం చేస్తారు. కొన్ని విషయాల్లో పనిభారం అధికంగా ఉంటుంది. ఏదైనా తప్పు చేస్తే దాని నుంచి ఉపశమనం పొందుతారు. కొన్ని పనులు సక్సెస్ కాకపోవడంతోనిరాశతో ఉంటారు.
కర్కాటకం:
కొన్ని రంగాల వారు బహుమతులు అందుకుంటారు. శుభకార్యానికి వెళ్లినట్లయితే ఆలోచనాత్మకంగా వ్యవహరించాలి. కొత్త వనరుల నుంచి ఆదాయం పొందుతారు.
సింహ:
వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. పిల్లల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొన్ని రంగాల వారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు.
కన్య:
శత్రువలు కదలికలపై దృష్టి పెట్టాలి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కొన్ని వాగ్దానాలను నెరవేరుస్తారు.
తుల:
కొన్ని విషయాలు అనుకూలంగా ఉంటాయి. దీంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. కొందరి నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
వృశ్చికం:
పెండింగు పనులను సకాలంలో పూర్తి చేయాలి. ఏదైనా కోరిక ఉంటే దానిని నెరవేర్చుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు.
ధనస్సు:
ఆదాయం పెరుగుతుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
మకర:
తోటి ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. కొందరితో శత్రుత్వం పెరిగిపోతుంది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. తప్పుడు వాగ్దానాలు చేయొద్దు.
కుంభం:
ఈ రాశి వారు ఈరోజు ఉల్లాసంగా ఉంటారు. స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి నుంచి ఎవరికైనా మాట ఇస్తే దానిని పూర్తి చేయాలి.
మీనం:
ఉద్యోగులు కార్యాలయాల్లో పూర్తి మద్దతు పొందుతారు. స్నేహితుడి నుంచి సాయం కోరుతారు. విహార యాత్రలకు వెళ్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.