Horoscope Today: ఈరోజు లక్ష్మీనారాయణ యోగం.. ఈ రెండు రాశుల వారికి డబ్బే డబ్బు..

అనారోగ్య సమస్యలతో బాధపడుతారు. విద్యార్థులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. వివాహానికి సంబంధించి ప్రతిపాదనలు వస్తాయి. స్నేహితులతో సరదాగా ఉంటారు. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.

Written By: Srinivas, Updated On : August 1, 2024 8:08 am
Follow us on

Horoscope Today: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై మృగశిఱ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు లక్ష్మీనారాయణ యోగం ఏర్పడనుంది. దీంతో సింహ, తుల రాశుల వారికి అనుకూల ప్రయోజనాలు. ఏ పని మొదలు పెట్టినా సక్సెస్ అవుతుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి:
వ్యాపారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో సీనియర్ల మద్దతు ఉంటుంది. పిల్లల కెరీర్ కు సంబంధించి ఆందోళన ఉంటుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.

వృషభ రాశి:
వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. కొందరు శత్రువులు మీపై ఆధిపత్యాన్ని చెలాయించడానికి ప్రయత్నిస్తారు. అందువల్ల కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. రాజకీయ రంగాల వారికి అన్నీ అనుకూలిస్తాయి. పిల్లల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు.

మిథున రాశి:
ఈ రాశివారికి ఈరోజు అన్నీ శుభాలే జరుగుతాయి. వ్యాపారులకు అనుకోని అదృష్టం కలిసి వస్తుంది. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏదైనా పెట్టుబడి పెట్టేవారికి అనుకూల సమయం. ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటించాలి.

కర్కాటక రాశి:
జీవనోపాధి కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వ్యాపారులు పెట్టుబడి విషయంలో పెద్దల సలహా తీసుకోవాలి. బంధువుల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా పొందే అవకాశం. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.

సింహారాశి:
అనారోగ్య సమస్యలతో బాధపడుతారు. విద్యార్థులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. వివాహానికి సంబంధించి ప్రతిపాదనలు వస్తాయి. స్నేహితులతో సరదాగా ఉంటారు. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.

కన్య రాశి:
వ్యాపారులకు అనుకోని లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయం పెరిగినా.. ఖర్చులు ఎక్కువవుతాయి. కొన్ని కోర్టు సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. పాత స్నేహితులను కలుస్తారు.

తుల రాశి:
జీవిత భాగస్వామితో పర్యటనకు వెళ్లే అవకాశం. పెద్దల అనుమతితో వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబ అవసరాల కోసం కొన్ని ఖర్చులు చేస్తారు. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

వృశ్చిక రాశి:
శారీరక సమస్యలు ఎదుర్కొంటారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వివాహ ప్రతిపాదన విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలి. పెండింగు పనులను పూర్తి చేస్తారు. ఏ పని చేపట్టినా అందులో నిర్లక్ష్యంగా ఉండకూడదు. లేకుంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ధనస్సు రాశి:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత స్నేహితులను కలుస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే వారికి అనుకూల సమయం. ఉద్యోగులు తోటి వారితో ఉల్లాసంగా ఉంటారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

మకర రాశి:
వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇవి భవిష్యత్ లో మంచి ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది. పెండింగు పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులు కొత్త ఆదాయం పొందుతారు.కార్యాలయాల్లో ప్రమోషన్ పొందే అవకాశం జీవిత భాగస్వామి కోసం బహుమతులు కొనుగోలు చేస్తారు.

కుంభరాశి:
ఉద్యోగులు సంయమనం పాటించాలి. లేకుంటే సమస్యలు ఎదురవుతాయి. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. వివిధ వర్గాల నుంచి శుభవార్తలు వింటారు. స్నేహితుల్లో ఒకరు మీకు సాయం చేయడానికి ముందుకు వస్తారు. ఆహారపు అలవాట్లపై నియంత్రణ ఉండాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీనరాశి:
పిల్లల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటంబ సభ్యుల్లో చీలికలు ఏర్పడవచ్చు. కొత్త వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలి. విలువైన వస్తువులను కాపాడుకోవాలి. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో ఎవరినీ నమ్మొద్దు.