Horoscope Today:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 ఫిబ్రవరి 20న ద్వాదశ రాశులపై అర్ద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. మంగళవారం చంద్రుడు మిథున రాశిలో సంచరించనున్నాడు. దీంతో ఓ రాశివారు కొత్త ఉద్యోగంలో చేరుతారు. మరి కొన్ని రాశుల వారు ఈ వివాదాల జోలికి వెళ్లొద్దు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు కొత్త పనిని ప్రారంభించడానికి అనుకూల సమయం. ఇతరుల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు.
వృషభ రాశి:
ఆకస్మిక పర్యటనలు చేస్తారు. ఉద్యోగులు కొత్త ఉద్యోగంలో చేరడానికి ఇదే అనువైన సమయం. అనవసర వివాదాల జోలికి వెళ్లకుండా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మిథునం:
ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. గతంలో చేసిన తప్పులు మరోసారి రిపీట్ కాకుండా జాగ్రత్తపడాలి.
కర్కాటకం:
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ పథకంలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు. ఉద్యోగులకు సీనియర్ల నుంచి మద్దతు ఉంటుంది. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి.
సింహ:
విదేశాల్లో చదువుకోవాలనుకునేవారు శుభవార్త వింటారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్యం కలుగుతుంది. వాహనాలపై ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.
కన్య:
కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇతరులకు ఎటువంటి వాగ్దానాలు చేయకుండా ఉంటే బెటర్. వ్యాపారులు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి.
తుల:
ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఎవరి దగ్గరినైనా అప్పు తీసుకున్న డబ్బును తిరిగి చెల్లిస్తారు. కుటుం సభ్యుల ప్రవర్తనపై దృష్టి పెట్టాలి.
వృశ్చికం:
ఫోన్ ద్వారా కొన్ని శుభవార్తలు వింటరు. వ్యాపారుల పెట్టుబడులు లాభిస్తాయి. పాత తప్పులు రిపీట్ చేయొద్దు. కొన్ని పనుల నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
ధనస్సు:
వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. జీవిత భాగస్వామితో ప్రేమగా ఉంటారు. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. ఆస్తిని పెంచుకునేందుకు తీవ్రప్రయత్నాలు చేస్తారు.
మకర:
ఆదాయాన్ని పెంచుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. కానీ అనుకూల పరిస్థితులు లేవు. వివాదాల జోలికి వెళ్లకుండా ఉండాలి. గతంలో మొదలుపెట్టిన పనులు పూర్తవుతాయి.
కుంభం:
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మార్కెట్లో పెట్టుబడులకు అనుకూలం. ఆస్తికి సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
మీనం:
వివాదాలకు దూరంగా ఉండాలి. వాహనాలపై ప్రయాణం చేసేవారు వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. ఓ సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది.