Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 మార్చి 16న ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. శనివారం చంద్రుడు మిథున రాశిలో సంచరించనున్నాడు. ఈ కారణంగా ఓ రాశి వారు విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మరో రాశి వారు ఎక్కువగా వాదనలు చేయకుండా ఉండాలి. మిగతా రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులు కొన్ని అవార్డులు పొందడంతో వీరు సంతోషంగా ఉంటారు. పెండింగు పనులు పూర్తి చేస్తారు. ఇతరుల సలహాలకు దూరంగా ఉండండి.
వృషభ రాశి:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది. బాధ్యతలను నెరవేర్చడంలో ముందుంటారు.
మిథునం:
వ్యాపారంలో పెట్టుబడుల కోసం కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవచ్చు. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వినోద కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు.
కర్కాటకం:
కొన్ని పనుల కోసం అకస్మాత్తుగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉండే అవకాశం. మీ మాటలతో కొన్ని వివాదాలు ఉండే అవకాశం.
సింహ:
కొన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు. వ్యాపారులు ఇతరుల సలహాలు తీసుకోకుండా ఉండడమే మంచిది. ఉపాధి కోసం ఎదురుచూసేవారికి శుభవార్త.
కన్య:
స్నేహితుల సాయంలో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఎక్కువగా వాదనలు చేయొద్దు. ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని ముఖ్యమైన ప్రణాళికలు వేస్తారు.
తుల:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉన్నత విద్య చేసే వారి ప్రయత్నాలు ఫలించొచ్చు. లక్ష్యాలను పూర్తి చేయడంతో ఆనందంగా ఉంటారు.
వృశ్చికం:
వ్యాపారానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం.సంబంధాలు మెరుగుపడుతాయి. అనేక రంగాల వారికి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి.
ధనస్సు:
కొన్ని సమస్యలపై కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. కొత్త వాహనం కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. సొంత పనిలో ఎవరినీ భాగస్వామ్యం చేయొద్దు.
మకర:
విలువైన వస్తువును బహుమతిగా పొందుతారు. ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొన్ని రంగాల వారు సంతోషంగా గడుపుతారు.
కుంభం:
ఉద్యోగుల పనితీరుపై ప్రశంసలు దక్కుతాయి. జీవిత భాగస్వామి సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. కొన్ని రంగాల వారు నిరాశతో ఉంటారు.
మీనం:
ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఇంట్రెస్ట్ పెడుతారు. ఆదాయం పెరిగినా ఖర్చులను అదుపులో ఉంచడం వల్ల ప్రయోజనం ఉంటుంది.