Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారి జీవితాల్లో బుధవారం అనూహ్య మార్పులు జరగనున్నాయి. ఈరోజర ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు కర్కాట రాశిలోకి ప్రశేశం చేస్తాడు. ఈ కారణంగా సిద్ధయోగం ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూల ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మేషం తో సహా మొత్తం 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో ఆర్తిక ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. కుటుంబంలో ఒకరి వివాహం గురించి చర్చిస్తారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
వృషభ రాశి:
వ్యాపారులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు కొన్ని విషయాల్లో కష్టపడాల్సి ఉంటుంది. కొత్త పనిని ప్రారంభించేముందు పెద్దల సలహా తీసుకోవాలి.
మిథున రాశి:
వ్యాపార రంగంలోని వారికి అనుకూల ఫలితాలు. గతంలో పెట్టిన పెట్టుబడులకు అనుకోకుండా లాభాలు. పిల్లల భవిష్యత్ గురించి శుభవార్తలు వింటారు. ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి:
ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. విదేశాల్లో ఉండే పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడుతాయి.
సింహారాశి:
ఒక పనిని పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ సమయంలో ధైర్యం, సాహసం కూడా చేస్తారు. వ్యాపారులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.ఉద్యోగులు సమయాన్ని వృథా చేయొద్దు. విలాసాల కోసం డబ్బు ఖర్చు అవుతుంది.
కన్య రాశి:
కుటుంబ సభ్యుల కోసం సమయాన్ని వెచ్చిస్తారు. వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రత్యర్థులతో గొడవలు ఉంటాయి.
తుల రాశి:
వివాహ పనుల్లో బిజీగా ఉంటారు. ప్రత్యర్థులు మీపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో వాదనలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామితో సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది.
వృశ్చిక రాశి:
ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. ఇంటి అవసరాలకు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు. కార్యాలయానికి సంబంధించిన కొన్ని పనులు పూర్తి చేస్తారు.
ధనస్సు రాశి:
ఉన్నత విద్య చేయాలనుకునేవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురవుతారు. సాయంత్రి వివాహ కార్యక్రమాలతో బిజీగా ఉంటారు. సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం.
మకర రాశి:
సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోర్టు సమస్యలను ఎదుర్కొంటారు. ఉద్యోగులు కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు. సీనియర్ అధికారితో వేధింపులు ఉంటాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం.
కుంభరాశి:
జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు వింటారు. సాయంత్రం స్నేహితులతో సరదాగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్ పొందే అవకాశం. వ్యాపారులు అధిక ఆదాయం పొందుతారు.
మీనరాశి:
వ్యాపారులు అనుకోని లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి కోసం బహుమతిని కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం.