Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 మొదలై ఎట్టకేలకు నాలుగు వారాలు పూర్తి అయ్యింది. నిన్న సోనియా ఎలిమినేషన్ తో 5వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ నాలుగు వారాల్లో మనకి బిగ్ బాస్ ఎన్నో ట్విస్టులు ఇచ్చాడు. టాస్కుల కంటే ఎక్కువగా గొడవలే జరిగాయి. గత సీజన్ లో 10 వారాలకు సరిపడ గొడవలు, ఈ సీజన్ లో నాలుగు వారాలకే జరిగింది. కానీ టాస్కులు మాత్రం చాలా తక్కువ గా పెట్టారు, ‘స్టార్ మహిళా’ మరియు ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ వంటి షోస్ లో నివహించే టాస్కులు బిగ్ బాస్ హౌస్ లో నిర్వహిస్తున్నారు అనే విమర్శలు కూడా వచ్చాయి. అంత వీక్ టాస్కులు ఉన్నాయి అన్నమాట. ఈ సీజన్ బడ్జెట్ చాలా లిమిట్ అని, అందుకే ఇలాంటి టాస్కులు నిర్వహిస్తున్నారని, బిగ్ బాస్ హౌస్ ని కూడా చాలా తక్కువ డబ్బులతో నిర్మించారని ఇలా పలు రకాల విషయాలు సోషల్ మీడియా లో వినిపించాయి.
ఇదంతా పక్కన పెడితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే అక్టోబర్ 5 వ తారీఖున 9 మంది వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. సాధారణంగా డబుల్ ఎలిమినేషన్ అనేది శనివారం, ఆదివారం జరిగేది. కానీ ఈసారి మిడ్ వీక్ అనగా బుధవారం రోజు ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున నిన్నటి ఎపిసోడ్ చివర్లో చెప్పుకొచ్చాడు. ఇలా బిగ్ బాస్ చరిత్రలో 5 వ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. అయితే ఎప్పుడూ చివరి వారాల్లో పెట్టే మిడ్ వీక్ ఎలిమినేషన్, ఇప్పుడు 5 వ వారం లోనే పెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి?, నిజంగానే కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేస్తారా?, లేదా సీక్రెట్ రూమ్ లో దాచుతారా అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్.
ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఆదిత్య ఓం లేదా పృథ్వీ రాజ్ నామినేషన్స్ లోకి వస్తే వీళ్లిద్దరి ఎవరో ఒకరు బుధవారం రోజు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఆదిత్య ఓం కాకుండా యష్మీ వస్తే వీరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వొచ్చు. ఒకవేళ హౌస్ లో భారీ ఓటింగ్ వచ్చే కంటెస్టెంట్స్ మాత్రమే నామినేట్ అయితే మాత్రం ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్ తప్పదు. కాబట్టి రేపటి నామినేషన్స్ చాలా కీలకం కాబోతుంది. ఈ నాలుగు వారాలు జరిగిన నామినేషన్స్ వేరు, రేపు జరగబోయే నామినేషన్స్ వేరు. నిన్నటి ఎపిసోడ్ చివర్లో రేపు నామినేషన్స్ కి సంబంధించిన ప్రోమో ని టెలికాస్ట్ చేస్తారు. ఈ ప్రోమో మణికంఠ యష్మీ, నైనికా ని నామినేట్ చేస్తాడు. అలాగే నైనికా నబీల్ ని నామినేట్ చేయగా, సీత మణికంఠ ని నామినేట్ చేస్తుంది. మరి రేపు పూర్తి స్థాయి నామినేషన్స్ లోకి ఎవరెవరు వస్తారో చూడాలి.