Horoscope Today: 2024 జూన్ 2 ఆదివారం రోజున ద్వాదశ రాశులపై ఉత్తరాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మీన రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా 5 అంటే కర్కాటకం, మకరం, మీనం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. మరికొన్ని రాశుల వారు ప్రశాంతతను కోల్పోతారు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
ఇంటికి అతిథులు వస్తారు. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కొన్ని ప్రమాదకరమైన విషయాలపట్ల అప్రమత్తమంగా ఉండాలి.
వృషభ రాశి:
వ్యాపారులకు లాభాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రశంసలు దక్కుతాయి. కొన్ని పనుల కారంణంగా అందరూ బిజీగా ఉంటారు.
మిథున రాశి:
ఇచ్చిన మాటను నెరవేర్చుకోవడానికి కృషి చేస్తారు. పాత స్నేహితులను కలుస్తారు. శత్రువులపై జాగ్రత్తగా ఉండాలి. కోర్టుకు సంబంధించిన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి.
కర్కాటక రాశి:
ఇతరుల సమస్యలపై దృష్టి పెడుతారు. విహార యాత్రకు సిద్ధమవుతారు. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. లక్ష్యం కోసం తీవ్రంగా కృషి చేస్తారు.
సింహారాశి:
ఉద్యోగులు కీలక చర్చల్లో పాల్గొంటారు. స్నేహితుల ద్వారా శుభవార్తలు వింటారు. ఇతరుల పనుల్లో అనవసరంగా జోక్యం చేసుకోవద్దు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు.
కన్య రాశి:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. కొంతమందికి అనుకోని అదృష్టం కలుగుతుంది. పాత అప్పులను తిరిగి చెల్లిస్తారు.
తుల రాశి:
ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఎదుటివారి సూచనలను పాటిస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు పొందే అవకాశం. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి.
వృశ్చిక రాశి:
వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. దీంతో సంతోషంగా ఉంటారు. పిల్లల కెరీర్ కు సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవాలి.
ధనస్సు రాశి:
కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. బాధ్యతల కారణంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. కొన్ని సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని పనుల నిమిత్తం ప్రశాంతతను కోల్పోతారు.
మకర రాశి:
కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. నిరుద్యోగ యువతకు కొత్త అవకాశాలు వస్తాయి. పెద్దల పట్ల గౌరవంగా ఉంటారు. వ్యాపారులు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి.
కుంభరాశి:
వ్యక్తిగత విషయాలపై శ్రద్ధ వహించాలి. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయొద్దు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. ఎవరితోనైనా అహంకారంగా మాట్లాడొద్దు.
మీనరాశి:
సామాజిక కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. జీవిత భాగస్వామిపై కోపం తెచ్చుకుంటారు. కొన్ని ముఖ్యమైన విషయాల్లో గోప్యత పాటించాలి.