Horoscope Today: ఈ రెండు రాశుల వారికి ఈరోజు అధిక ధన లాభం.. 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయంటే?

పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు ఏర్పడుతాయి. శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. వారితో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Written By: Chai Muchhata, Updated On : July 31, 2024 7:50 am

Horoscope Today

Follow us on

Horoscope Today: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ఏకాదశి, ధ్రువ యోగం ఉండనుంది. దీంతో కొన్ని రాశుల వారిపై విష్ణు అనుగ్రహం ఉండనుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి:
ఈ రాశి వారు ఎవరైనా ఈరోజు పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. దీంతో కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటారు. ఫలితంగా వారితో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు మాటలను అదుపులో ఉంచుకోవాలి.

వృషభ రాశి:
జీవిత భాగస్వామితో విహార యాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనుకోని ఆదాయం పెరుగుతుంది. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే ముందు వెనకా ఆలోచించండి. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు.

మిథున రాశి:
పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు ఏర్పడుతాయి. శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. వారితో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. వివాహానికి సంబంధించి కొత్త ప్రతిపాదనలు వస్తాయి. పెండింగులో ఉన్న సమస్యలు నేటితో పరిష్కారం అవుతాయి. కొన్ని కారణాల వల్ల ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటించాలి.

సింహారాశి:
ఉద్యోగులు కార్యాలయాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటారు. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. సాయంత్రం కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కొన్ని పనుల కారణంగా సమస్యలు ఎదురవుతాయి.

కన్య రాశి:
కొన్ని పనుల్లో ఆలస్యం చేయొద్దు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. జీవిత భాగస్వామికి బహుమతిని అందిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

తుల రాశి:
ఉద్యోగులు కార్యాలయాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. వీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు ఫలితాలు ఇస్తాయి. సమాజంలో కొందరి నుంచి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

వృశ్చిక రాశి:
వ్యాపారులు కొత్త పెట్టుబడుల విషయంలో చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. పిల్లల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొన్నట్లయితే అనుకూల ఫలితాలు ఉంటాయి.

ధనస్సు రాశి:
ఉద్యో్గులు కార్యాలయాల్లో ప్రమోషన్ పొందుతారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. ఇదే సమయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు పెద్దల సలహా తీసుకోవాలి. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి:
ఈ రాశివారికి ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. అనేక రంగాల వారికి అనుకోని అదృష్టం వరిస్తుంది. పిల్లల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. ఇవి భవిష్యత్ లో లాభిస్తాయి.

కుంభరాశి:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ప్రయాణాలు చేసేవారు అజాగ్రత్తతో ఉండొద్దు. విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఉద్యోగులు సీనియర్ల నుంచి మద్దతు పొందుతారు.

మీనరాశి:
ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటించాలి. బంధువుల నుంచి గౌరవం పొందుతారు. ఏదైనా పనిని ప్రారంభించాలనుకుంటే బంధువుల సాయం తీసుకుంటారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. పాత సమస్యల నుంచి బయటపడుతారు.