https://oktelugu.com/

Horoscope Today: ఈ రాశులపై సోమవతి అమావాస్య ప్రభావం.. ప్రయోజనాలు ఎలా ఉంటాయంటే..?

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారులు కొన్ని రిస్క్ నిర్ణయాలు తీసుకుంటారు. కొందరు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యులతో ఏదైనా చర్చలు జరుగుతే అవి ఫలితాలను ఇస్తాయి. ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : December 30, 2024 / 07:54 AM IST

    Horoscope Today(7)

    Follow us on

    Horoscope Today: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. ఇందులో భాగంగా సోమవారం ద్వాదశ రాశులపై మూలా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు సోమవతి అమావాస్య కారణంగా కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉండే అవకాశం. అందువల్ల మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారుల కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. పిల్లలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు.

    వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో సరదాగా ఉంటారు. విదేశాల్లో ఉండే పిల్లలనుంచి శుభవార్తలు వింటారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా ప్రయాణాలు ఉంటాయి.

    మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): రాజకీయాల్లో ఉండేవారికి ఈరోజు అనుకూల వాతావరణం. వ్యాపారంలో అదనపు పెట్టుబడులు పెడతారు. ఇవి భవిష్యత్తులో లాభాలను తీసుకొస్తాయి. ఇతరుల వద్ద అప్పు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం స్నేహితులతో సరదాగా ఉంటారు. కొన్ని అవసరాల కోసం ఖర్చులు పెరుగుతాయి.

    కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : శత్రువులు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల కొత్త వ్యక్తుల తో జాగ్రత్తగా ఉండాలి. రోజు వారి అవసరాల కోసం ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి అనుకూల వాతావరణం. సాయంత్రం కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.

    సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారులు కొన్ని రిస్క్ నిర్ణయాలు తీసుకుంటారు. కొందరు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యులతో ఏదైనా చర్చలు జరుగుతే అవి ఫలితాలను ఇస్తాయి. ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి.

    న్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. దీంతో ఉల్లాసంగా ఉంటారు. కొన్ని రంగాల వారు ఏ పని చేపట్టిన విజయం అవుతుంది. ఇతరులతో వాగ్వాదం చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

    తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. కొన్ని పనులు పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. ఉద్యోగులు కార్యాలయాల నుంచి అదనపు ప్రయోజనాలు పొందుతారు.

    వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేనితో కీర్తి పెరుగుతుంది. రాజకీయాల్లో ఉండేవారికి ప్రజల మద్దతు ఉంటుంది. కుటుంబ సభ్యులకు సమయం కేటాయించాలి. లేకపోతే జీవిత భాగస్వామి నుంచి వ్యతిరేకత వస్తుంది. ఏదైనా వివాదం ఉంటే దానిని వెంటనే పరిష్కరించుకోవాలి.

    ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. కార్యాలయాల్లో ఉద్యోగులకు మద్దతు ఉంటుంది. కొందరికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. రోజువారి అవసరాల కోసం ఖర్చులు పెరుగుతాయి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.

    మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్నేహితుల్లో ఒకరి నుంచి బహుమతిని పొందుతారు. సాయంత్రం ఆ ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు.

    కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) కుటుంబంలో సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి. తండ్రి సహాయంతో వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడతారు. జీవిత భాగస్వామితో ప్రయాణాలు ఉంటాయి. విద్యార్థులు ఉన్నత విద్య కోసం చేసే ప్లాన్లు సక్సెస్ అవుతాయి.

    మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : వ్యాపారులకు ప్రతికూల వాతావరణం ఉంది. కొన్ని నిర్ణయాలలో మార్పులు చేసుకోవడం మంచిది. పై అధికారుల నుంచి ఉద్యోగులు ఒత్తిడి ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.