Horoscope Today:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 మార్చి 2 న ద్వాదశ రాశులపై చిత్రా నక్షత్ర ప్రభావం ఉంటుంది. శనివారం చంద్రుడు ధనస్సు రాశిలో సంచరించనున్నాడు. దీంతో ఓ రాశి వారి కోర్టు సమస్య పరిష్కారం అవుతుంది. మరో రాశి వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
కటుుంబ సభ్యుల మధ్య వాగ్వాదాలు ఉండే అవకాశం. శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయించవచ్చు. వ్యాపారులు సమస్యలపై ఆందోళన చెందకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలి.
వృషభ రాశి:
ఈ రాశివారికి ఈరోజు ఖర్చులు పెరుగుతాయి. ఇంటికి అతిథి వస్తారు. ఉద్యోగులు కార్యాలయంలో బిజీ వాతావరణంలో ఉంటారు. గతంలో చేసిన తప్పులపై గుణపాఠం నేర్చుకుంటారు.
మిధునం:
కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే ఇతరులను సంప్రదించాలి. ఏదైనా సమస్యపై ఆందోళన చెందకుండా ఉండాలి.కుటుంబ సభ్యులపై చిన్న సమస్యలు ఉంటాయి.
కర్కాటకం:
కొన్ని పనులు సక్సెస్ కాకపోవడంతో ఆందోళనతో ఉంటారు. ఇతరులకు ఉచిత సలహాలు ఇవ్వొద్దు. అవి తేడా కొడుతాయి. ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి.
సింహ:
విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు.ఓ పని కోసండ డబ్బు సాయం అడుగుతారు. ఇంట్లో విషయాలపై శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కన్య:
బయటి వ్యక్తులతో వివాదం రావొచ్చు. అప్పు తీసుకున్న డబ్బును చెల్లించగలుగుతారు. ఆదాయం పెరిగినందున సంతోషంగా ఉంటారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను పూర్తి చేస్తారు.
తుల:
ఇతరుల ఆర్థిక లావాదేవీల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండాలి. ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశం. మంచి మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలి.
వృశ్చికం:
రాజకీయాల్లో ఉండేవారికి అనుకూల ఫలితాలు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి. ఖర్చులను అదుపులో ఉంచాలి.
ధనస్సు:
కొన్ని వివాదాలు కోర్టులో ఉంటే అది నేటితో పరిష్కారం అవుతుంది. దీంతో ఈరోజు ప్రశాంతంగా ఉంటారు. కొన్ని మార్గాల నుంచి డబ్బు అధికంగా వస్తుంది.
మకర:
భవిష్యత్ కోసం కొత్త ప్లాన్ చేస్తారు. ఆస్తుల విషయంలో కొందరు మోసం చేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు బదిలీలు ఉండే ఛాన్స్.
కుంభం:
ఉద్యోగులు పదోన్నతి పొందవచ్చు. వాదనలకు దిగకుండా ఉండాలి. వ్యాపారవేత్తలు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
మీనం:
ఉద్యోగులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. మనసులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలను రాకుండా ఉంచుకోవాలి. స్నేహితులతో సరదాగా ఉంటారు.