Western Toilet : వెస్ట్రన్ టాయిలెట్ ఎక్కువగా ఉపయోగిస్తే ఏమవుతుంది?

అదే వెస్ట్రన్ టాయిలెట్స్‌లో అయితే నార్మల్ డెలివరీ కష్టమే. ఈ రకం టాయిలెట్స్‌ను వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు కూడా అనారోగ్య సమస్యల బారిన పడతారు. కాబట్టి ఇండియన్ టాయిలెట్స్ వాడటానికి ట్రై చేయండి.

Written By: Swathi, Updated On : August 17, 2024 10:34 pm

Mobile Use In Toilet

Follow us on

Western Toilet : అప్పటి రోజుల్లో చాలామంది బహిరంగంగా మలవిసర్జన చేసేవాళ్లు. ప్రభుత్వం వీటిపై అవగాహన కల్పించడంతో రాను రాను అందరూ బాత్‌ర్రూం అలవాటు చేసుకున్నారు. ఇప్పటికీ గ్రామాల్లో కొందరు బహిరంగంగానే మలవిసర్జన చేస్తున్నారు. అయితే ఈ మధ్య ఎక్కువశాతం మంది వెస్ట్రన్ టాయిలెట్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఇండియన్ టాయిలెట్స్ కంటే వెస్ట్రన్ టాయిలెట్స్‌ వాడటానికి ఎక్కువ ఇష్టం చూపిస్తున్నారు. దీనికి కారణం ఇండియన్ టాయిలెట్ కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. అయితే వెస్ట్రన్ టాయిలెట్ కంటే ఇండియన్ టాయిలెట్ వాడటమే మంచిదని వైద్యలు అంటున్నారు. కూర్చోవడానికి ఇండియన్ టాయిలెట్ అసౌకర్యంగా ఉన్నా.. ఇదే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వెస్ట్రన్ టాయిలెట్ వల్లే ఎక్కువ నష్టాలు ఉన్నాయని వైద్యులు అంటున్నారు. మరి ఈరోజు ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

కీళ్ల, కాళ్లు నొప్పులు, ఆపరేషన్ అయిన వాళ్లకి వెస్ట్రన్ టాయిలెట్ సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ వీటిని వాడటం వల్ల అతిసారం, కడుపు సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదముందని వైద్యులు అంటున్నారు. వెస్ట్రన్ టాయిలెట్ వల్ల కూర్చున్నప్పుడు చర్మానికి తగులుతుంది. దీనివల్ల క్రిములు, బ్యాక్టీరియా తొందరగా వ్యాప్తి చెందుతాయి. అలాగే వీటిని వాడటం వల్ల ఫైల్స్, మలబద్దకం సమస్యలు వస్తాయి. ఇండియన్ టాయిలెట్ వల్ల జీర్ణవ్యవస్థపై ఎలాంటి ఒత్తిడి పడదు. కానీ వెస్ట్రన్ టాయిలెట్ వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడుతుంది. దీంతో మలబద్దకం సమస్య వస్తుంది. వీటిని వాడటం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వీటిని వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రోజూ వీటని శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే వీటిపై కూర్చుంటే బ్యాక్టీరియా చర్మానికి తగులుతుంది. అదే రోజూ శుభ్రం చేసుకుంటే వేరే వాళ్లు వెళ్లిన మీకు ఆ బ్యాక్టీరియా అంటకపోవచ్చు. కాబట్టి వెస్ట్రన్ టాయిలెట్స్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించం మంచిది.

ఇండియన్ టాయిలెట్స్‌లో కూర్చోవడం వల్ల శరీరానికి వ్యాయామం అవుతుంది. దీనివల్ల మూత్రవిసర్జన ఫీగా కావడంతో పాటు రక్తప్రసరణ కూడా జరుగుతుంది. కూర్చోని, నిల్చోవడం వల్ల బాడీకి బాగా వ్యాయామం కావడంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. ఇండియన్ టాయిలెట్స్‌లో కూర్చుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వెస్ట్రన్ టాయిలెట్స్ ఉపయోగించేటప్పుడు టిష్యూ పేపర్ వాడుతారు. ఇది యోనిలోకి వెళ్తే ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఇండియన్ టాయిలెట్స్ కంటే వెస్ట్రన్ టాయిలెట్స్‌కు నీరు ఎక్కువగా కావాలి. గర్భిణులు ఇండియన్ టాయిలెట్లను వాడటం మంచిది. ఎందుకంటే ఇండియన్ టాయిలెట్స్‌ను వాడటం వల్ల గర్భాశయంపై ఒత్తిడి పడదు. దీంతో ప్రసవం సహజంగా, సాఫీగా సాగుతుంది. అదే వెస్ట్రన్ టాయిలెట్స్‌లో అయితే నార్మల్ డెలివరీ కష్టమే. ఈ రకం టాయిలెట్స్‌ను వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు కూడా అనారోగ్య సమస్యల బారిన పడతారు. కాబట్టి ఇండియన్ టాయిలెట్స్ వాడటానికి ట్రై చేయండి.