Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 మార్చి 23న ద్వాదశ రాశులపై పూర్వ పాల్ఘుని నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఆకస్మిక ఆదాయం వస్తుంది. మరికొన్ని రాశుల వారు ఆందోళనతో ఉంటారు. 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశివారు ఈరోజు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం పెరుగుతుంది.
వృషభ రాశి:
కొన్ని పనులపై శ్రద్ధ చూపుతారు. ఉద్యోగులు సీనియర్లతో వాదనలకు దిగకుండా ఉండాలి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. కొన్ని విషయాల్లో ఓపిక అవసరం.
మిథునం:
ఉద్యోగులు బాధ్యతలు నెరవేరుస్తారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. విదేశాలకు వెళ్లేవారు శుభవార్తలు వింటారు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటకం:
వ్యాపార వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహా తీసుకోవాలి. విద్యారంగలోని వారు ప్రతిభను కనబర్చి ప్రశంసలు పొందుతారు. ఆదాయం పెరిగినా ఖర్చులు ఉంటాయి.
సింహ:
నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఇతరుల సలహాలు పాటించాలి.
కన్య:
వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ప్రణాళిక ప్రకారం డబ్బును ఖర్చు చేస్తారు. దానాలు ఎక్కువగా చేస్తారు.
తుల:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. విద్యార్థులు సంతోషంగా ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి.
వృశ్చికం:
జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. స్నేహితులతో కలిసి పెట్టుబడులపై చర్చిస్తారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు:
ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అనవసర వాదనలకు దిగొద్దు. వ్యాపారుల ఆదాయంలో పురోగతి ఉంటుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు.
మకర:
కుటుంబ సభ్యుల నుంచి మద్దతు ఉంటుంది. ఉద్యోగులు లక్ష్యంపై దృష్టి పెడుతారు. ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు. అనుకున్న పనులు నెరవేరుతాయి.
కుంభం:
అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులు కార్యాలయంలో విధులపై చర్చిస్తారు. వ్యక్తిగత విషయాలపై దృష్టి పెట్టాలి. ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువ.
మీనం:
ఉద్యోగులు కొన్ని విషయాల్లో చేసే ప్రయత్నాులు సక్సెస్ అవుతాయి. వ్యాపారులకు అనుకూలమైన రోజు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.