Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 మార్చి 17న ద్వాదశ రాశులపై మృగశిర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ కారణంగా కర్కాటక రాశి వారికి ఆకస్మిక లాభా చేకూరుతుంది. మిథునం రాశివారు ఇతరుల విషయాల్లో తలదూర్చొద్దు. మిగతా రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశి వారు ఈరోజు సంతోషంగా గడుపుతారు. గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు తోటివారితో జాగ్రత్తగా ఉండాలి.
వృషభ రాశి:
కొన్ని పనుల్లో తొందరపడొద్దు. లేకుంటే భారీగా నష్టపోతారు. గతంలో ఇచ్చిన అప్పులు వసూలవుతాయి. కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవాలి.
మిథునం:
కొన్ని విషయాల్లో శుభవార్తలు వింటారు. అనవసర పనుల్లో తలదూర్చవద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఉద్యోగులు తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటకం:
ఈరాశి వారికి ఈరోజు ఆకస్మిక ఆర్థిక లాభం చేకూరుతుంది. ఆస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి నిరాశ సమాచారం అందుకుంటారు.
సింహ:
అనవసర వాదనలు చేయొద్దు. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం. అందువల్ల కేర్ తీసుకుంటూ ఉండాలి. అనుకోని ఆదాయం చేకూరుతుంది.
కన్య:
వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. లేకుంటే లక్ష్యాన్ని చేరుకోలేరు. ఉద్యోగులకు కొన్ని విషయాలు కలిసివస్తాయి.
తుల:
డబ్బు వ్యవహారాలు సమస్యలు తెస్తాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారు శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ముఖ్యమైన నిర్నయాలు తీసుకుంటారు.
వృశ్చికం:
వాహనాల కొనుగోలుకు సమాయత్తమవుతారు. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు వెనుకా ముందు ఆలోచించాలి. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు.
ధనస్సు:
కుటుంబసభ్యుల మధ్య విభేదాలు ఉంటే పరిష్కారం అవుతాయి. ప్రభుత్వం ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశాలు ఎక్కువ. కొన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు.
మకర:
వస్తువులు కొనుగోలు చేయడంలో బిజీ అవుతారు. స్నేహితులో ఒకరి సాయంతో పెట్టుబడులు పెడుతారు. కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.
కుంభం:
వ్యాపారస్తులకు కొన్ని ప్రణాళికలు సక్సెస్ అవుతాయి. ఉద్యోగులకు కొత్త సమస్యలు వస్తాయి. కొన్ని శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది.
మీనం:
వ్యాపార ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. కొన్ని పనుల కోసం అధికంగా డబ్బు వెచ్చిస్తారు.