spot_img
Homeఆధ్యాత్మికంHoroscope Today: ఎంతో కాలంగా బాధపడుతున్న ఈ రాశులపై శనీశ్వరుడి అనుగ్రహం.. ఇక నుంచి వీరికి...

Horoscope Today: ఎంతో కాలంగా బాధపడుతున్న ఈ రాశులపై శనీశ్వరుడి అనుగ్రహం.. ఇక నుంచి వీరికి కష్టాలు తీరినట్లే…

Horoscope Today: గ్రహాల మార్పుల కారణంగా కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. శనివారం ద్వాదశరాసులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో శష్ రాజయోగం ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారిపై శనీశ్వరుని ఆశీస్సులు ఉంటాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

మేష రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరిగే అవకాశం. వ్యాపారులకు అనుకోని లాభాలు రావడంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగులు సీనియర్ల నుంచి మద్దతు పొందుతారు. ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి.

వృషభ రాశి: వ్యాపారులకు తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటుంది. దీంతో కొత్తపేటలో పెడతారు. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. విదేశాల్లో ఉండే విద్యార్థుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు సీనియర్లు సమస్యలు పరిష్కరిస్తారు.

మిథున రాశి: ఉద్యోగులు లక్ష్యాన్ని పూర్తి చేస్తారు. కొన్ని పనులు పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారులు కొన్ని రిస్కులను అధిగమిస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.

కర్కాటక రాశి: శుభ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇతరులకు కొన్ని వస్తువులు దానం చేస్తారు. కుటుంబ సభ్యులతో గొడవ ఉండడం వల్ల గందరగోళం ఏర్పడుతుంది. దీంతో మనసు ఆందోళనగా ఉంటుంది. కొన్ని పనులకు దూరంగా ఉండటమే మంచిది. ఓ సమాచారం ఆందోళన కలిగిస్తుంది.

సింహారాశి: ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అకస్మాత్తుగా డబ్బు ఖర్చయ్యే అవకాశం. కొందరికి ధన లాభం ఉండడంతో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులకు కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.

కన్య రాశి: సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారస్తులను కొందరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. అందువల్ల ఎవరిని నమ్మడానికి అవకాశం లేదు. ఆర్థిక వ్యవహారాల్లో ఇతరుల జోక్యం ఉండకుండా చూడాలి. జీవిత భాగస్వామితో ఏకాంతంగా ఉంటారు.

తుల రాశి: కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే ఇతరుల సలహా తీసుకోవాలి. ఉద్యోగులకు సోదరుల సహాయం ఉంటుంది. పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో వివాహానికి ముందడుగు పడుతుంది.

వృశ్చిక రాశి: వ్యాపారులు అనుకూల ఫలితాలు పొందుతారు. ప్రియమైన వ్యక్తులతో సంతోషంగా ఉంటారు. ఇతరులతో మాట్లాడే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. కొన్ని వాదనలకు దూరంగా ఉండాలి. బంధువుల నుంచి తన సహాయం తీసుకోకుండా ఉంటేనే మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొన్నట్లయితే విజయవంతంగా పూర్తి చేస్తారు.

ధనస్సు రాశి: భూ సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కుదుటపడుతుంది. దీంతో ప్రశాంతమైన వాతవరణం ఏర్పడుతుంది. వాహన కొనుగోలుకు సంబంధించిన పనులు పూర్తి చేస్తారు. ఎవరికైనా డబ్బు సహాయం చేస్తారు.

మకర రాశి: చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పనులు నేటితో పూర్తవుతాయి. చట్టపరమైన చిక్కుల నుంచి బయట పడతారు. కుటుంబంలో ఎవరితోనైనా వివాదం ఏర్పడితే నేటితో సమసి పోతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

కుంభరాశి: అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఇతరులతో ఆస్తికి సంబంధించిన ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులకు కార్యాలయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. లక్ష్యాన్ని పూర్తి చేయడంతో జీతం కూడా పెరిగే అవకాశం ఉంది.

మీనరాశి: వ్యాపారులకు నష్టాలు వచ్చే అవకాశం భవిష్యత్తులను దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు పెట్టే విషయంలో ఆలోచించాలి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. సాయంత్రం బంధువులతో ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Andhra Pradesh Investments

Andhra Pradesh Investments: ఏపీకి భారీ పెట్టుబడులు!

Andhra Pradesh Investments: రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఉత్తరాంధ్రకు వరుసగా ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లు వచ్చాయి....
Modi Instagram Reel

Modi Instagram Reel: మోదీ ఇన్‌స్టా రీల్‌తో ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 30 కోట్లకు పైగా వ్యూస్‌!

Modi Instagram Reel: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది....
AP MLC Elections

AP MLC Elections: ఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరు నేతలను ఫిక్స్ చేసిన చంద్రబాబు!

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభం అయింది. గవర్నర్ కోటా కింద ఎంపికైన జాకీయా ఖానం, పండుల రవీంద్రబాబు ఈనెల 28న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో...
Roja

Roja: తీవ్ర నిర్ణయం దిశగా రోజా!

Roja: ఇటీవల మాజీ మంత్రి రోజా పెద్దగా కనిపించడం లేదు. రాజకీయంగా యాక్టివ్ గా లేరు. పార్టీ కార్యాలయం నుంచి వచ్చే కంటెంట్ తో సోషల్ మీడియాలో పెట్టే ట్విట్లకు పరిమితం అవుతున్నారు....
Ravi Teja

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...
Oktelugu Epaper