https://oktelugu.com/

Horoscope Today: ఈ రాశి వ్యాపారులపై శనీశ్వరుడి అనుగ్రహం.. ఊహించని లాభాలు..

ఈ రాశి వారు ఈరోజు అసంతృప్తితో ఉంటారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. కుటంబంలో కొన్ని గొడవలు ఉండే అవకాశం. ఉద్యోగులు ప్రతికూల ఫలితాలు పొందుతారు.

Written By:
  • NARESH
  • , Updated On : November 23, 2024 / 08:08 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. శనివారం ద్వాదశ రాశులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉండనుంది.ఇదే సమయంలో కొన్ని రాశులపై శని దేవుడి అనుగ్రహం ఉండడంతో ఆర్థికంగా ప్రయోజనాలు ఉండే అవకాశం. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం. ఈ నేపథ్యంలో మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    ఈ రాశి వ్యాపారులకు కొన్ని ఆటంకాలు ఏర్పడుతాయి. అనారోగ్య సమస్యలు వెంటాడే అవకాశం. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉండే అవకాశం. ఉద్యోగులు ఒత్తిడిన ఎదుర్కొంటారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి.

    వృషభరాశి:
    ఉద్యోగులు ఆచి తూచి వ్యవహరించాలి. ఏమాత్రం తొందరపడినా తీవ్రంగా నష్టపోతారు. బంధువులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. భవిష్యత్ ను దష్టిలో ఉంచుకొని వ్యాపారులు కీలక పెట్టుబడులు పెడుతారు.

    మిథున రాశి:
    ఈ రాశి వ్యాపారులు ఈరోజు అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగులు లక్ష్యాన్ని చేరుకోవడంతో సంతోషంగా ఉంటారు. విద్యార్థులు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

    కర్కాటక రాశి:
    కొన్ని పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులకు దూరంగా ఉండాలి. లేకుంటే వివాదాల్లో చిక్కుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓ సమాచారం ఆందోళనను కలిగిస్తుంది. ముఖ్యమైన వారితో సంప్రదింపులు చేస్తారు.

    సింహా రాశి:
    విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. కొన్ని పనులు పూర్తి చేయడంతో ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. దీంతో ఉల్లాసంగా ఉంటారు.

    కన్యరాశి:
    ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. స్నేహితులత నుంచి కీలక సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో సందోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం బహుమతిని కొనుగోలు చేస్తారు.

    తుల రాశి:
    ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు.దీంతో మానసికంగా ధ్రుఢంగా ఉంటారు. ఉద్యోగులు కష్టపడి తమ పనులను పూర్తి చేస్తారు.

    వృశ్చిక రాశి:
    శత్రువులపై ఓ కన్నేసి ఉంచండి. బంధువులతో ఉల్లాసంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. విహార యాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులతో వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు.

    ధనస్సు రాశి:
    పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు చేపడుతారు. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం. విద్యార్థులు కెరీర్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.

    మకర రాశి:
    ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో గడిపేందుకు సమయం కేటాయించాలి. జీవిత భాగస్వామిని విహార యాత్రలకు తీసుకెుళ్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొన్నట్లయితే విజయం సాధిస్తారు.

    కుంభ రాశి:
    పెద్దల సలహాతో వ్యాపారులు పెట్టుబడులు పెడుతారు. జీవిత భాగస్వామితో వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఇదే మంచి సమయం. ఇంటిని అందంగా తీర్చిదిద్దుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    మీనరాశి:
    ఈ రాశి వారు ఈరోజు అసంతృప్తితో ఉంటారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. కుటంబంలో కొన్ని గొడవలు ఉండే అవకాశం. ఉద్యోగులు ప్రతికూల ఫలితాలు పొందుతారు.