Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 మార్చి 19న ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో తులా రాశివారు ఈరోజు ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మరో రాశివారు కొత్త వ్యక్తులను కలుస్తారు. అలాగే 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఆస్తులకు సంబంధించిన కొన్ని శుభవార్తలు వింటారు. కొన్ని వాగ్దానాలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త వ్యక్తులు కలుస్తారు. ఓ విషయంలో ఆందోళనతో ఉంటారు.
వృషభ రాశి:
ఉద్యోగులు లక్ష్యంపై దృష్టి పెడుతారు. ఎవరైనా సలహా ఇస్తే దాని గురించి ముందుగా ఆలోచించాలి. మార్పు కోరుకునే ఉద్యోగులకు మంచి అవకాశం. వ్యాపారుల పెట్టుబడులు లాభిస్తాయి.
మిథునం:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. వ్యాపారాభివృద్ధి కోసం కృషి చేస్తారు. పాత స్నేహితులను కలుస్తారు.
కర్కాటకం:
సమయాన్ని వృథా చేసుకోవచ్చు. అనవసర వాదనలకు దిగొద్దు. కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సింహ:
శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు కదులుతారు. ఉద్యోగుల పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. అవసరానికి సాయం చేసేవారు ఉంటారు.
కన్య:
ఇంట్లో పనులతో బిజీగా ఉంటారు. కొన్ని విషయాల్ల ఆందోళనతో ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఇతరుల సలహాల పనికొస్తాయి. అజాగ్రత్తగా ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.
తుల:
ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఆస్తి కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో ఏదైనా పని చేయడం వల్ల లాభాలు వస్తాయి. కొత్త విజయాలతో సంతోషంగా ఉంటారు.
వృశ్చికం:
కెరీర్ కు సంబంధించిన విషయాలపై దృష్టి పెడుతారు. కుటుంబ సభ్యులతో గొడవలు ఏర్పడుతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలంటే కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోవాలి.
ధనస్సు:
కొన్ని పనులపై నిర్లక్ష్యంగా ఉండకూడదు. వ్యాపారం చేసేవారు పెద్ద ప్రాజెక్టును పొందుతారు. దీంతో ప్రతిష్ట పెరుగుతుంది. ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఉంటుంది.
మకర:
కుటుంబ సభ్యులతో సంబంధాల్లో చీలిక వస్తుంది. సమాజంలో కొన్ని పనులు చేయడం వల్ల గౌరవం పెరుగుతుంది. ఓ పనిపై ప్రత్యేకంగా దృష్టి పెడుతారు.
కుంభం:
వివాహ ప్రతిపాదనలు వస్తాయి. దీంతో కుటుంబం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎవరైనా అప్పుడ అడిగితే జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యాపారులు లాభాలు పొందుతారు.
మీనం:
ఎక్కువగా వాదనలు చేస్తారు. అయితే ఇవి ఒక్కోసారి మంచే జరుగుతాయి. పెండింగులో ఉన్న సమస్యలపై దృష్టి సారిస్తారు. ఓ పనిని పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడుతారు.