https://oktelugu.com/

Horoscope Today: ఈ రాశుల వారికి ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు..

కొన్ని పనులు పూర్తి చేయడానికి రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. అయినా వెనుకడుగు వేయొద్దు. విద్యార్థుల చదువులకు ఆటంకాలు ఏర్పడుతాయి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం కేటాయిస్తారు.

Written By:
  • Srinivas
  • , Updated On : December 11, 2024 / 07:58 AM IST

    Horoscope Today(3)

    Follow us on

    Horoscope Today: గ్రహాల మార్పు వల్ల కొన్ని రాశులపై అనుకోని ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులు ఉంటాయి. బుధవారం ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉండనుంది. ఇదే సమయంలో రవియోగం ఏర్పడడంతో కొన్ని రాశుల వారికి ఊహించిన దానికంటే ఎక్కువ ఆదాయం లభిస్తుంది. మరికొన్ని రాశుల వారు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి: వ్యాపారులు అనుకున్నదానికంటే ఎక్కువే లాభాలు పొందుతారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు పెడితే అవి లాభిస్తాయి. ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశం ముఖ్యమైన విషయాలపై కుటుంబంలో చర్చకు రావొచ్చు.

    వృషభరాశి:
    కొన్ని పనులు పూర్తి చేయడానికి రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. అయినా వెనుకడుగు వేయొద్దు. విద్యార్థుల చదువులకు ఆటంకాలు ఏర్పడుతాయి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం కేటాయిస్తారు.

    మిథున రాశి:
    ఈరాశి వారు ఈరోజు ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే ఇవ్వండి. ఎందుకంటే వాటి వల్ల అధిక ప్రయోజనాలు ఉంటాయి. కుటంబ సభ్యుల్లో ఒకరితో విభేదాలు ఉంటాయి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే తీవ్రంగా నష్టపోతారు.

    కర్కాటక రాశి:
    జీవిత భాగస్వామితో వాగ్వాదాలు ఉండొచ్చు. దీంతో మనసు ఆందోళనగా ఉంటుంది. వ్యాపార విషయంలో కొందరితో విభేదాలు వస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి.

    సింహా రాశి:
    పెండింగ్ లో ఉన్న డబ్బు వసూలు అవుతుంది. విదేశాల్లో ఉండే వారి నుంచి సంతోషకరమైన వార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పోటీ పరీక్ష్లలో పాల్గొనే విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

    కన్యరాశి:
    పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. వ్యాపారం కోసం సీనియర్ల నుంచి సలహా తీసుకుంటారు. జీవిత భాగస్వామి కోసం విలువైన బహుమతిని అందజేస్తారు. ఇంట్లో కొన్ని అనవసర ఖర్చులు ఉంటాయి. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు.

    తుల రాశి:
    సమాజంలో గౌరవం పెరుగుతుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. పిల్లల ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందుతారు. ఎవరితోనైనా వాగ్వాదం ఉంటే జాగ్రత్తగా ఉండాలి.

    వృశ్చిక రాశి:
    ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు పెట్టాలి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వివాహితులకు ప్రతిపాదనలు వస్తాయి. ఎవరికైనా ధన సాయం చేయడానికి ముందుకు వస్తారు. దీంతో సమాజంలో గౌరవం పెరుగుతుంది.

    ధనస్సు రాశి:
    కొందరు శత్రువులు మీ పనులకు ఆటంకాలు సృష్టించవచ్చు. అందువల్ల ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. బంధువుల నుంచి ధన సాయం పొందుతారు. జీవిత భాగస్వామితో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

    మకర రాశి:
    కుుటుంబ సభ్యుల్లో ఒకరి వివాహాలకు ఆటంకాలు ఏర్పడుతాయి. అయితే ఒకరి జోక్యంతో ఇది సమసిపోతుంది. విద్యార్థులు ఉన్నత విద్యకు ప్లాన్ చేస్తే అది సక్సెస్ అవుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.

    కుంభ రాశి:
    జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. కొన్ని వైపుల నుంచి అకస్మాత్తుగా ధనం వస్తుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో అనేక ప్రయోజనాలు పొందుతారు. ఆర్థికంగా పుంజుకుంటారు. స్నేహితులు కలవడంతో ఉల్లాసంగా ఉంటారు.

    మీనరాశి:
    ఆర్థికంగా నష్టాలు ఉంటాయి. దీంతో ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇలాంటి సమయంలో వ్యాపారులకు జీవిత భాగస్వామి అండగా నిలుస్తుంది. ఇంట్లో ఒకరికి అనారోగ్యం ఏర్పడడంతో మనసు ఆందోళనగా ఉంటుంది.