https://oktelugu.com/

Mulugu : తెలంగాణలో మళ్లీ పులి.. ఈసారి ఎటువైపు వెళ్లిందంటే.. అటవీశాఖ అధికారులు ఎలాంటి హెచ్చరికలు చేశారంటే?: వైరల్ వీడియో

మొన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులి కదలికలు సంచలనం సృష్టించాయి. మొదట్లో ఒక పులి మాత్రమే వచ్చిందనుకున్నారు. ఆ తర్వాత అధికారుల పరిశీలనలో రెండవ పులి కూడా వచ్చిందని తెలిసింది. అయితే ఇందులో ఒక పులి ఒక వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణమైంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 11, 2024 / 06:04 AM IST

    Tiger

    Follow us on

    Mulugu :  ప్రస్తుతం శీతాకాలం.. అడవులు ఆకు రాల్చుతున్నాయి. క్రూర మృగాలకు ఆహారం లభించడం లేదు. పైగా అవి సంక్రమణ దశలో ఉండడంతో పులులు బయటికి వస్తున్నాయి. జనసంచారం ఉన్న ప్రాంతాల మీద పడుతున్నాయి. మనుషుల మీద దాడులు చేస్తున్నాయి. పశు సంపదపై పడి ప్రాణాలు తీస్తున్నాయి. తమ ఆకలి తీర్చుకుంటున్నాయి. ఇదే సమయంలో తమకు సరైన జోడి కోసం వెతుక్కుంటున్నాయి. ఇటీవల మహారాష్ట్ర లోని తడోబా ప్రాంతం నుంచి పులులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి. ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశించాయి. ఈ సందర్భంగా ఒక మేకల కాపరిపై దాడి చేసేందుకు ఓ పులి యత్నించింది. అతడు గట్టిగా కేకలు వేయడంతో పారిపోయింది. ఇంక మరో ఘటనలో ఓ వ్యక్తిని పులి గాయపరిచింది. ఇంకో చోట చంపేసింది. మరో ప్రాంతంలో ఓ వ్యక్తిని చంపడానికి పులి ప్రయత్నించగా.. అతడి భార్య చాకచక్యంగా పులి బారి నుంచి కాపాడింది. ఈ సంఘటనలు మర్చిపోకముందే తెలంగాణ రాష్ట్రంలో పులి సంచారం కలకాలం సృష్టిస్తోంది.

    మంగపేట లోకి ప్రవేశించిందట

    తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా వెంకటాపురం గోదావరి సరిహద్దుల్లో కొద్దిరోజులుగా పోలీస్ సంచరిస్తోంది. సమీప ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ ప్రాంతంలో ఇటీవల విస్తారంగా మిరప తోటలు సాగు చేశారు. అవి పూత, కాత దశలో ఉన్నాయి. అత్యంత ఏపుగా పెరిగాయి. ఈ క్రమంలో పులి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గాని.. ఈ ప్రాంతంలో సంచరిస్తోంది. ఇటీవల ఈ ప్రాంతానికి చెందిన ఓ రైతు తన మిరప పొలానికి నీరు పెట్టడానికి ఉదయాన్నే వెళ్ళాడు. ఆ సమయంలో ఆ పులి అతడి మిరప తోట నుంచి బయటికి వెళ్లడం కనిపించింది. దీంతో అతడు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు గోదావరి సమీప ప్రాంతాల్లోని మిరప తోటలకు చేరుకున్నారు. అక్కడ పులి అడుగుజాడలను గుర్తించారు. అయితే పులి నడిచిన విధానాన్ని బట్టి అది మంగపేట వైపు వెళ్ళిందని తెలుస్తోంది. ఇదే క్రమంలో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.. మంగపేట కూడా పూర్తి దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న మండలం. ఇది ములుగు ప్రాంతానికి సమీపంలోనే ఉంటుంది. ఇక్కడ కూడా క్రూరమృగాలు సంచరిస్తుంటాయి. పులి ఇటు వైపు వచ్చిందన్న సమాచారంతో మంగపేట ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. బయటికి వెళ్లాలంటే వణికి పోతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో జోరుగా మిరప తోటలో కలుపుతీత పనులు, మిరపకాయలు కోసే పనులు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పులి సంచారం వార్తలు రావడంతో రైతుల్లో కలవరం మొదలైంది. ఒంటరిగా కాకుండా గుంపుగానే వెళ్తున్నారు.