Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో మకర సంక్రాంతి పండుగ సందర్భంగా కొన్ని రాశుల వారికి అదనపు ఆదాయం రానుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారు ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఏమైనా పెండింగ్ పనులు ఉంటే వాటిని వెంటనే పూర్తి చేయాలి. లేకుంటే తీవ్ర నష్టాలు ఉంటాయి. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
.వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : మాటలను అదుపులో ఉంచుకోవాలి. కుటుంబం కోసం కొన్ని ప్రత్యేక పనులు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రియమైన వారితో ఉల్లాసంగా ఉంటారు. స్నేహితులను కలుస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఇంట్లో వారితో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. పెండింగ్ పనులను పూర్తి చేసుకుంటారు. కొన్ని లాభదాయకమైన శుభవార్తలు వింటారు. వ్యాపారాలు భవిష్యత్తు కోసం కొత్త ప్రణాళికలు వేస్తారు. విద్యార్థులకు కీలక సమాచారం అందుతుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఆదాయం కంటే ఖర్చు విపరీతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి . విభేదాలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి. కొన్ని పనులు ప్రత్యేకంగా పూర్తి చేసేందుకు ముందుకు రావాలి. సకాలంలో పనులు పూర్తి చేయడం వల్ల ఉల్లాసంగా ఉంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు. దీంతో నిరాశ చెందుతారు. అయితే తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. కొత్త వ్యక్తులు పరిచయం కావడంతో ఉల్లాసంగా ఉంటారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థుల నుంచి శుభవార్తలు వింటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : కొన్ని వివాదాల్లో చిక్కుకొని మానసికంగా ఆందోళనతో ఉంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీరితో జాగ్రత్తగా ఉండాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పొదుపు చేస్తారు. పెండింగ్ బకాయిలు వసూలు అవుతాయి. కొత్త కాంటాక్ట్ ను చేపడతారు. బంధువులతో ఉల్లాసంగా ఉంటారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : వ్యాపారులు అనుకున్న పలితాలు సాధించలేరు. దీంతో నిరాశతో ఉంటారు. ఉద్యోగులు అధికారుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. పాత స్నేహితులను కలవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. ఏ పని మొదలుపెట్టిన పూర్తి చేసేందుకు శ్రమ పడాలి. కుటుంబ సభ్యులు ఆరోగ్యం పై నిర్లక్ష్యంగా ఉండొద్దు. పాత పనుల పూర్తి చేయడంపై దృష్టి పెడతారు. విదేశాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : వ్యాపార కార్యకలాపాలు స్తబ్దంగా ఉంటాయి. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. పిల్లలతో సంతోషంగా ఉంటారు. పండగ వాతావరణం లో ఉండడం వల్ల ఉల్లాసంగా గడుపుతారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : గతంలో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక పూజలు చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. పెండింగు బకాయిలు వసూలు అవుతాయి. కొత్త వారితో పరిచయం లభిస్తుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. గతంలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. ఏ పని చేపట్టినా పూర్తి చేసే వరకు శ్రమిస్తూ ఉండాలి. పెండింగ్ బకాయిలు వసూలు అవుతాయి.