Horoscope Today:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 మార్చి 10న ద్వాదశ రాశులపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఆదివారం చంద్రుడు మీన రాశిలో సంచరించనున్నాడు. ఈ కారణంగా రాజకీయాల్లో ఉండే ఓ రాశివారికి కొత్త అవకాశాలు వస్తాయి.ఓ రాశి ఉద్యోగులకు రుణాలు మంజూరవుతాయి. అలాగే మిగతా రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ప్రతికూల ఆలోచనలను రానివ్వద్దు. ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని సమస్యలు ఏర్పడుతాయి. తల్లిదండ్రులు అప్పగించే బాధ్యతలను నెరవేర్చాలి. వ్యాపారులకు అనుకూలం.
వృషభ రాశి:
ఈ రాశివారు ఈరోజు ఉల్లాసంగా ఉంటారు. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. ఆస్తి సంబంధిత విషయాల్లో సక్సెస్ అవుతారు. వ్యాపారులు అవసరానికి మించి పెట్టుబడి పెట్టకండి.
మిథునం:
కొత్త పనులు చేపట్టడంపై ఆసక్తి చూపుతారు. ఆస్తి కొనుగోలు విషయంలో కోరిక నెరవేరుతుంది. ఉద్యోగం రావడంతో సంతోషంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది.
కర్కాటకం:
ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకుంటే ఫలిస్తాయి. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడుతారు. పాత స్నేహితులను కలుస్తారు.
సింహ:
చట్ట పరమైన చిక్కులు ఉంటాయి. ఉద్యోగులు కార్యాలయంలో కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారులు అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకోవాలి.
కన్య:
జీవిత భాగస్వామితో బేధాభిప్రాయాలు రావొచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆదాయం పెరుగుతుంది. అయితే సేవా కార్యక్రమాలకు ఎక్కువగా వెచ్చిస్తారు.
తుల:
ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేవారు ఆందోళనతో ఉండకూడదు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. పాత స్నేహితులను కలుస్తారు.
వృశ్చికం:
వ్యక్తిగత బాధ్యతలు పెరుగుతాయి. సంబంధాలు మెరుగుపరచడంలో కృషి చేస్తారు. కొన్ని శుభవార్తలు వింటారు. రాజకీయాల్లో ఉండేవారికి కొత్త అవకాశాలు వస్తాయి.
ధనస్సు:
కొన్ని విషయాల్లో సానుకూల వాతావరణం. పనుల కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులు సీనియర్లతో సంయమనం పాటించాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
మకర:
డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులను డబ్బు సాయం అడుగుతారు. ఏదైనా పనిని మొదలుపెట్టేటప్పుడు ఇతరుల సలహాలు తీసుకోవాలి.
కుంభం:
ఇతరుల నుంచి అప్పు తీసుకున్నట్లయితే వెంటనే చెల్లిస్తారు. కుటుంబ సభ్యులతో ఎక్కువగా వాదనలు చేయొద్దు. ఉద్యోగులకు ఈరోజు అనుకూల వాతావరణం.
మీనం:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో పెద్దల సలహాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.