Gold Price Today: పసిడి ప్రియులకు బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. గత వారం రోజులుగా బంగారం ధరలు రోజుకు రూ.500 చొప్పున పెరుగుతూ మొత్తంగా రూ.3 వేలు పెరిగింది. అంతర్జాతీయంగా బంగారం ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2179 డాలర్లుగా నమోదైంది. సిల్వర్ ఔన్స్ కు 24.32 డాలర్ల ట్రేడ్ అవుతోంది. 2024 మార్చి 10వ తేదీన ధరలు ఎలా ఉన్నాయంటే?
బులియన్ మార్కెట్ ప్రకారం.. మార్చి 10న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,750గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.66,270 గా ఉంది. మార్చి9న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,250తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి శనివారంతో పోలిస్తే ఆదివారం రూ.500 మేర పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,900ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.66,420గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,750 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.66,270 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.61,500 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.67,100తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.60.750 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.66,270తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.60,270తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.66,270తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలతో పాటు వెండి ధరలు పెరిగాయి. ఆదివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.75,700గా నమోదైంది. శనివారంతో పోలిస్తే ఆదివారం రూ.100 పెరిగింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.75,700గా ఉంది. ముంబైలో రూ..75,700, చెన్నైలో రూ.79,200, బెంగుళూరులో 75,000, హైదరాబాద్ లో రూ.79,100తో విక్రయిస్తున్నారు.