Horoscope Today:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 మార్చి 12న ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది.మంగళవారం చంద్రుడు మేష రాశిలో సంచరించనున్నాడు. ఈ కారణంగా ఓ రాశివారి వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అలాగే మిగతా రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశివారు ఈరోజు ఉల్లాంగా ఉంటారు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూల సమయం. విద్యార్థులు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. విదేశాల్లో చదువు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృషభ రాశి:
శుభకార్యాల్లో పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండలి.పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు.
మిథునం:
గతంలో తీసుకున్న అప్పులను తిరిగి చెల్లిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు ఉంటాయి. మార్కెటింగ్ తో సంబంధం ఉన్న వ్యక్తులకు కలిసి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా సాగించాలి.
కర్కాటకం:
ఆర్థికంగా బలోపేతం అవుతుంది. సంబంధాలు మెరుగుపడుతాయి. కష్టపడి చేసిన పనులు ఫలితాలనిస్తాయి. ఉద్యోగులు కొత్త విషయాలను నేర్చుకుంటారు.
సింహ:
పాత స్నేహితులను కలుస్తారు. ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులు ఆలోచనాత్మకంతా ముందుకు సాగుతారు. ఉద్యోగులు తమ విధులను నెరవేర్చడంలో సక్సెస్ అవుతారు.
కన్య:
కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. విద్యార్థులకు కొంచెం కష్టం ఉంటుంది. ఇతరులకు అప్పుు ఇవ్వడంలో వెనుకంజ వేయడమే మంచిది. కొన్ని ప్రణాళికలు సక్సెస్ అవుతాయి.
తుల:
కొన్ని రంగాల్లో వారికి సానుకూల ఫలితాలు. భవిష్యత్ గురించి ఆందోళన చెందుతారు. ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులు శుభవార్తలు వింటారు. ప్రయాణాలు ఉండే అవకాశం.
వృశ్చికం:
వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త వ్యక్తులతో కమ్యూనికేషన్ పెంచుకుంటారు. వ్యాపారులు సజావుగా నిర్వహిస్తారు.
ధనస్సు:
ఈ రాశివారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆస్తికి సంబంధించిన విషయంలో అనుభవమున్నవారి నుంచి సలహాలు తీసుకోవాలి. ఉద్యోగులకు కార్యాలయాల్లో సీనియర్ల మద్దతు ఉంటుంది.
మకర:
శత్రువుల నుంచి ముప్పు ఉండే అవకాశాలు ఎక్కువ. కొందరు మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టును పూర్తి చేస్తారు. పిల్లల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
కుంభం:
ఈ రాశివారు ఈరోజు బిజీగా ఉంటారు. వ్యాపార సంబంధిత విషయాల్లో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. ఆ తరువాత ఆదాయం సమకూరుతుంది.
మీనం:
వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఒత్తిడికి గురైతే మనసు ప్రశాంతంగా ఉంచేందుకు ప్లాన్ చేయాలి. భవిష్యత్ కోసం కొత్త ప్రణాళికలు వేస్తారు.