Horoscope Today:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 మార్చి 8న ద్వాదశ రాశులపై ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. శుక్రవారం చంద్రుడు కుంభ రాశిలో సంచరించనున్నాడు. మరో వైపు మహాశివరాత్రి సందర్భంగా మేషం, వృషభం, తులా, కుంభ, మకర రాశి వారికి అనుకూల వాతావరణం. వీరికి ఆదాయం పెరగడమే కాకుండా అన్ని శుభాలు జరుగుతాయి. అలాగే మిగతా రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగులకు కార్యాయాల్లో ప్రశంసలు దక్కుతాయి. స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయం పెరగడానికి మార్గాలు ఏర్పడుతాయి.
వృషభ రాశి:
ఉద్యోగులు కార్యాలయాల్లో నిరాశతో ఉంటారు. ఆర్థికంగా నష్టాలు ఉండే అవకాశం. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి.
మిధునం:
ఆన్ లైన్ లో పెట్టుబడి పెట్టేవారికి అనుకూల వాతావరణం. ఇతరువ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. కొందరు మీపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు.
కర్కాటకం:
ప్రియమైన వారికోసం కొన్ని ప్రత్యేక పనులు చేస్తారు. జీవిత భాగస్వామితో గొడవలు ఉంటాయి. కష్టాల గురించి స్నేహితులతో పంచుకోవాలి. ఇతరుల సలహాలు తీసుకోవాలి.
సింహ:
జీవిత భాగస్వామితో విహారయాత్రకు వెళ్లే ప్లాన్ చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పనిభారం ఉంటుంది. వ్యాపారులకు అనుకున్న పనులు నెరవేరుతాయి.
కన్య:
కొన్ని పనులను వాయిదా వేయడం మంచిది. వ్యాపారంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటారు. ఇతరుల నుంచి రుణం తీసుకోవాల్సి వస్తే వెయిట్ చేయాలి. గత సమస్యలను ఎదుర్కొవచ్చు.
తుల:
ఏదైనా డబ్బు పోగొట్టుకున్నట్లయితే తిరిగి పొందుతారు.కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల సలహాలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో ఉల్లాసంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
వృశ్చికం:
తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. తల్లిదండ్రులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు కొత్త ఉద్యోగంలోకి మారుతారు.
ధనస్సు:
కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆద్యాత్మికత వైపు ఆసక్తి పెరుగుతుంది. రాజకీయ రంగంలో పనిచేసేవారికి అనుకూల వాతావరణం.
మకర:
వాహనాలపై ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలి. గతంలో ఉన్న వివాదాలు నేటితో పరిష్కారం అవుతాయి. ఖర్చుల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు.
కుంభం:
కొర్టు సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు. విహార యాత్రలకు వెళ్లి ఉల్లాసంగా ఉంటారు. కొత్త పెట్టుబడులు లాభిస్తాయి. ఎవరికైనా అప్పు ఇస్తే సులభంగా పొందుతారు.
మీనం:
ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వారు శుభవార్తలు వింటారు. ఈరోజు మొత్తం ఆహ్లదకరమైన వాతావరణంలో గడుపుతారు. ఆస్తులు కొనుగోలు చేసేవారికి అనుకూల వాతావరణం.