https://oktelugu.com/

Horoscope Today: ఈ నాలుగు రాశులపై శివుడి అనుగ్రహం.. దీంతో వీరికి అన్ని అనుకూల ఫలితాలే…

శుభకార్యాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం ప్రియమైన వ్యక్తిని కలుసుకుంటారు. స్నేహితులతో సరదాగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : November 18, 2024 / 08:19 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: గ్రహాల మార్పుల కారణంగా కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. సోమవారం ద్వాదశ రాశులపై మృగశిర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు శివయోగం ఏర్పడడంతో కొన్ని రాశుల వారికి శంకరుని ఆశీస్సులు ఉంటాయి. మరికొన్ని రాశుల వారికి వారు ప్రతికూల పరిస్థితులు ఉంటాయి .12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

    మేష రాశి: ఈ రాశి వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన సమయం. ఆర్థికంగా పుంజుకుంటారు. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. సాయంత్రం స్నేహితులతో సరదాగా ఉంటారు.

    వృషభ రాశి: కొన్ని పనుల నిమిత్తం రిస్క్ ఉంటుంది. అయినా ముందడుగు వేయాలి. ఆర్థిక వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు కొన్ని కష్టాలు ఉంటాయి. వాహనాలపై ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.

    మిథున రాశి: ఉద్యోగులు ఈరోజు కార్యాలయాల్లో ఉల్లాసంగా ఉంటారు. పిల్లల భవిష్యత్తు గురించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులపై తల్లిదండ్రుల సలహా తీసుకోవాలి.

    కర్కాటక రాశి: కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటారు‌. కొందరితో వాగ్వాదం ఉండే అవకాశం. మానసికంగా ఆందోళనతో ఉంటారు. ఏదైనా ఉద్యోగం చేసేవారు సీనియర్ల నుంచి వేధింపులు ఎదుర్కొనే అవకాశం.

    సింహారాశి: శుభకార్యాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం ప్రియమైన వ్యక్తిని కలుసుకుంటారు. స్నేహితులతో సరదాగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.

    కన్య రాశి: ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి సమయం. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామిపై కోపం వస్తుంది. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది.

    తుల రాశి: మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశం. ఏ పని చేపట్టిన విజయం సాధిస్తారు .కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. కొందరితో వాగ్వాదం ఉండే అవకాశం.

    వృశ్చిక రాశి: ఎవరి దగ్గర నైనా అప్పు తీసుకోవాలని వస్తే వెనుక ముందు ఆలోచించాలి. కొన్ని అవసరాల కోసం డబ్బు సాయం పడుతుంది. అయితే సమయానికి రాకపోవడంతో మనసు ఆందోళనగా ఉంటుంది. సాయంత్రం స్నేహితులను కలుస్తారు.

    ధనస్సు రాశి: మాటలను అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారులకు జీవిత భాగస్వామి పూర్తి మద్దతు ఉంటుంది. అవసరాలు తీర్చుకోవడానికి ఖర్చులు అదరంగా ఉంటాయి. కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

    మకర రాశి: ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూల వాతవరణం ఉంటుంది. ఏ ప్రాజెక్టు చేపట్టిన వెంటనే పూర్తి చేస్తారు. వ్యాపారాలు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయితే భాగస్వాములతో చర్చల కారణంగా సమస్య పరిష్కారం అవుతుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

    కుంభరాశి: పెండింగ్ బకాయిలు రాకపోవడంతో ఆందోళనగా ఉంటుంది. కొందరు మీకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆహారాల అలవాట్లను నియంత్రించుకోవాలి.

    మీనరాశి: వ్యాపారులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది. సాయంత్రం ఏదైనా వాగ్వాదం జరిగితే వాటికి దూరంగా ఉండాలి. చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటే నేటితో పరిష్కారం అవుతాయి.