Horoscope Today:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉండనుంది. ఇదే రోజో భోగి పండుగ సందర్భంగా తుల రాశితో పాటు మరికొన్ని రాశుల వారికి అపారమైన ప్రయోజనాలు ఉన్నాయి. మేష రాశి వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మిగతా రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారు ఇతరులకు ధన సాయం చేస్తారు. దగ్గరి బంధువుల్లో ఒకరి వద్ద నుంచి మోసానికి గురవుతారు. సలహాలు అడగనిదే పెట్టుబడుల జోలికి వెళ్లకండి. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : పెండింగ్ సమస్యలకు పరిష్కారాలు కనుగొంటారు. విద్యార్థులు పోట పరీక్షలో పాల్గొన్నట్లయితే విజయం సాధిస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో వివాదం ఏర్పడే అవకాశం. అందువల్ల మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : భవిష్యత్ పై జీవితభాగస్వామితో ప్రణాళికలు వేస్తారు. ఇంటి అవసరాల కోసం ఖర్చులు చేస్తారు. విదేశాల్లో ఉండే వారి నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : వ్యాపారులు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో గుర్తింపు వస్తుంది. కొత్త పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు. విదేశాల్లో ఉండే వారి నుంచి శుభవార్తలు వింటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఇంటి పనుల్లో నిమగ్నమైతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడుతారు. ఇతరులకు సాయం చేయడం ద్వారా ఉల్లాసంగా ఉంటారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : కొత్త పెట్టుబడుల విషయం గురించి ఆలోచిస్తారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. పిల్లల చదువు గురించి కీలక నిర్ణయం తీసుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : బంధువుల నుంచి గౌరవం పొందుతారు. రోజూ అవసరాల కోసం ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో వివాదం ఉంటే నేటితో సమసిపోతుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : కొన్ని విషయాల్లో జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశాలు ఎక్కువ. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇతరులతో వాగ్వాదం చేసే సమమంలో జాగ్రత్తగా ఉండాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : రాజకీయాల్లో ఉండేవారికి అనుకూలంగా ఉంటుంది. చాలా మందికి వ్యక్తుల మద్దతు ఉంటుంది. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు అపారమైన అవకాశాలు ఉంటాయి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే తిరిగి పొందుతారు.ఇతరుల విమర్శలను పెద్దగా పట్టించుకోవద్దు.