Horoscope Today:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 ఫిబ్రవరి 12న ద్వాదశ రాశులపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో ఓ రాశివారు ఎక్కువగా వాదనలు చేయడం వల్ల ప్రతికూల వాతవరణ ఏర్పడుతుంది. మరో రాశి వారు జీవిత భాగస్వామితో సంయమనం పాటించాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈరోజు ఈ రాశివారు విహార యాత్రలు చేస్తారు. వ్యాపారస్తులు పెట్టుబడుల పెట్టేముందు పెద్దల సలహాలు తీసుకోవాలి. ఉద్యగులకు తోటి వారి సహకారం ఉంటుంది.
వృషభ రాశి:
ఈ రాశివారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునేముందు పెద్దలను సంప్రదించాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం సమకూరుతుంది.
మిథునం:
తెలియని వ్యక్తులకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామితో వాదనలకు దిగొద్దు. పిల్లలు చెప్పే కొన్ని విషయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేస్తారు.
కర్కాటకం:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఓ వ్యక్తి మిమ్మల్ని కలుస్తాడు. అతనితో మీ జీవితం మారుతుంది.
సింహ:
ఇంటికి బంధువులు వచ్చే అవకాశం. జీవిత భాగస్వామితో ప్రేమగా మెలగాలి. వ్యాపారులకు ఆదాయం సమకూరుతుంది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం.
కన్య:
కొన్ని ముఖ్యమైన పనుల కోసం సమయాన్ని వెచ్చిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో సమయాన్ని వృథా చేయొద్దు. అనుకున్న పనుల కోసం కష్టపడాల్సి వస్తుంది.
తుల:
ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. అధికారులతో సమావేశం అవుతారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం. కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాలి.
వృశ్చికం:
ఈరోజు ఈ రాశివారు ఆహ్లాదంగా గడుపుతారు. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెడుతారు. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. విహార యాత్రలు చేసే అవకాశం.
ధనస్సు:
కొన్ని ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఇతరులతో ఎక్కువగా వాదనలు చేయొద్దు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. దీంతో మనసు ప్రశాంతంగా మారుతుంది.
మకర:
పాత స్నేహితులను కలుస్ారు. పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించాలి. ఉద్యోగులు అనుకున్న లక్ష్యంపై దృష్టి పెడుతారు. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు.
కుంభం:
జీవిత భాగస్వామితో వాదనలు ఉంటాయి. ఈ సమయంలో కాస్త ఓర్పు అవసరం. వ్యాపారులు పెట్టుబడులు పెడుతారు. కొత్త ఆదాయం సమకూరుతుంది.
మీనం:
ఆదాయ మార్గల కోసం అన్వేషిస్తారు. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు ఉంటాయి. వాదనలను కట్టుబెట్టాలి. ఆరోగ్యంపై ఆందోళన చెందుతారు.