Horoscope Today : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం చంద్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతోద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సందర్భంగా మేషం నుంచి మీనం వరకు 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
మేషరాశి:
ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఇష్టమైన ఆహారం తింటారు. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. వివాహ ప్రతిపాదనలు రావొచ్చు. ప్రమాదకర కార్యకలాపాలు నిర్వహించాలి.
వృషభం:
ఉద్యోగులకు ప్రశంసలు దక్కుతాయి. ఉపాధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బెట్టింగులకు దూరంగా ఉండాలి. కొన్ని సమస్యల నుంచి బయటపడుతారు.
మిథునం:
స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. ఆర్థికపరమైన ప్రయోజనాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేస్తారు. అనవసర విషయాలపై చిరాకు పడొచ్చు.
కర్కాటకం:
తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. చెడు స్నేహితులకు దూరంగా ఉండాలి. అనవసర వాదనలకు దిగొద్దు. కొన్ని విషయాల్లో ఓపికగా ఉండాలి.
సింహ:
పెట్టుబడి పెట్టేవారు ఆలోచనాత్మకంగా వ్యవహరించాలి. కొన్ని శుభవార్తలు వింటారు. అదృష్టం అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
కన్య:
వ్యాపారం కోసం పర్యటనలు చేస్తారు. కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు.
తుల:
వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. అయితే ఆదాయం బాగుంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.
వృశ్చికం:
ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. కొన్ని ఒడిదొడుకులు ఉన్నా.. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. వాహనాలపై ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు:
ప్రమాదకర వ్యక్తులు తారసపడుతారు. వారికి దూరంగా ఉండాలి. వ్యాపార ఒప్పందాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి.
మకర:
కొన్ని వివాదాల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో సంయమనం పాటించండి. ఎక్కువగా వాదనలకు దిగొద్దు.
కుంభం:
అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉంటాయి. ప్రయాణం ఆసక్తికరంగా ఉంటుంది. ఆదాయం పెరిగినా ఖర్చులు పెరుగుతాయి. ఉపాధి పనులు చేసేవారికి పురోగతి లభిస్తుంది.
మీనం:
ఇతరులను ఎక్కువగా నమ్మొద్దు. వివాదాలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. కొన్ని అనుమాలతో తప్పులు చేసే అవకాశం.