Horoscope Today:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 మార్చి 9న ద్వాదశ రాశులపై ధనిష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. శనివారం చంద్రుడు కుంభ రాశిలో సంచరించనున్నాడు. ఈ కారణంగా ఓ రాశి వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. మరో రాశివారి ఉద్యోగుల పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. అలాగే మిగతా రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశివారు ఈరోజు ఉల్లాసంగా ఉంటారు. ఆదాయం సమకూరుతుంది. ఉద్యోగుల పనితీరుపై అధికారులు ప్రశంసలు అందిస్తారు. గతంలో మొదలుపెట్టిన కొన్ని పనులు పూర్తవుతాయి.
వృషభ రాశి:
ఆన్ లైన్ పెట్టుబడులకు అనుకూల సమయం. కుటుంబంతో ఉల్లాసంగా ఉంటారు. విదేశాలకు వెళ్లే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం కోసం ప్రణాళికలు వేస్తారు.
మిథునం:
ఇతరులతో ఎక్కువగా వాదనలు చేయకుండా ఉండాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటకం:
కొన్ని విషయాల్లో గందరగోళం ఉంటుంది. అసంపూర్తి పనులను పూర్తి చేస్తారు. ఇతరుల సాయం కోరగానే అందుతుంది. విహార యాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.
సింహ:
ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశాలు ఎక్కువ. ఆకస్మిక ఆదాయం పొందుతారు. భాగస్వామితో వాదనలకు దిగకండి. వ్యాపార సంబంధించిన విషయాల్లో ఆందోళన చెందుతారు.
కన్య:
ఉద్యోగుల పనితీరుకు ప్రశంసలు అందుతాయి. ముఖ్యమకైన పత్రాలను పొందుతారు. కొందరి నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
తుల:
స్నేహితులతో కలిసి విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. పాత సమస్యలపై ఉపశమనం పొందుతారు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృశ్చికం:
కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. దీంతో ఉల్లాసంగా ఉంటారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారుల పెట్టుబడులకు అనుకూల ఫలితాలు వస్తాయి.
ధనస్సు:
ఆస్తుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. కొన్ని పనుల్లో బిజీగా ఉంటారు. ఉద్యోగులు తోటివారితో భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోవాలి. కుటుంబంతో ఉల్లాసంగా ఉంటారు.
మకర:
జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఇంటికి అతిథులు రావొచ్చు. కొత్త పనులు చేరపడుతారు. వ్యాపార భాగస్వామితో సంయమనం పాటించండి.
కుంభం:
ఆస్తులకు సంబంధించిన విషయంలో ఆనందంగా ఉంటారు. ఏదైనా గొడవ కారణంగా ఆందోళనగా ఉంటారు. కొందరి నుంచి బహుమతులు పొందుతారు.
మీనం:
పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పోటీ పరీక్ష్లల్లో పాల్గొనేవారు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువగా వాదనలకు దిగకుండా ఉండాలి.