https://oktelugu.com/

Horoscope Today : ఈ రాశులపై కార్తీక పౌర్ణమి ప్రభావం.. వ్యాపారులకు అనుకోని ధన లాభం..

ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. పిల్లల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులు ఏవైనా కొత్త ప్రయత్నాలు చేస్తే అవి సక్సెస్ అవుతాయి. శత్రువులను జయిస్తారు.

Written By:
  • NARESH
  • , Updated On : November 19, 2024 / 08:15 AM IST

    Horoscope Today(3)

    Follow us on

    Horoscope Today : గ్రహాల మార్పు కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. మంగళవారం ద్వాదశ రాశులపై ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. రాజకీయాల్లో ఉండే వారికి ఈరోజు కలిసి వస్తుంది. మేషంతో సహా మొత్తం రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    కుటుంబ సభ్యులతో వాగ్వాదం ఉంటుంది. సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవాలి. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    వృషభరాశి:
    విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బంధువుల నుంచి ఆర్థిక సాయం అందుతుంది. ఇతరుల వద్ద అప్పు తీసుకుంటే వెంటనే చెల్లించండి.

    మిథున రాశి:
    వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. విదేశాల్లో ఉండే వారి నుంచి శుభవార్తలు వింటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. రాజకీయాల్లో ఉండేవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

    కర్కాటక రాశి:
    వ్యాపారులకు ఊహించని లాభాలు వస్తాయి. ఉద్యోగులకు కార్యాలయాల్లో మద్దతు ఉంటుంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో విహార యాత్రలు వెళ్తారు. కొత్తవస్తువులు కొనుగోలు చేస్తారు.

    సింహా రాశి:
    ఆనవసర ఖర్చులు పెరిగే అవకాశం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు కొత్త ఆదాయం సమకూరుతుంది. కొందరు మీపై ఆధిపత్యానికి ప్రయత్నిస్తారు. అందువల్ల కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.

    కన్యరాశి:
    వ్యాపారులకు స్నేహితుల నుంచి మద్దతు ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆదాయం అంతకంతకు పెరుగుతుంది. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు సాగుతాయి.

    తుల రాశి:
    కుటంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. కొందరు ఈ రాశి వారికి ధన సాయం చేస్తారు. ఆస్తి కొనుగోలుకు ప్రయత్నిస్తే సక్సెస్ అవుతుంది. చట్టపరమైన సమస్యలు ఉంటే తొలగిపోతాయి. ఇంటి అవసరాల కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.

    వృశ్చిక రాశి:
    వ్యాపారులు భాగస్వాములతో చర్చిస్తారు. సాయంత్రి తల్లిదండ్రులతో కలిసి ఉంటారు. విద్యార్థులు తమ గురువుల నుంచి ప్రశంసలు పొందుతారు. మనసులో ఉత్సాహం ఉంటుంది.

    ధనస్సు రాశి:
    సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు అనుకోకుండా డబ్బు వస్తుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటే ఇతరుల సలహాలు తీసుకోవాలి.

    మకర రాశి:
    చేపట్టిన పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. దీంతో ఉల్లాసంగా ఉంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి ఏకాంతంగా ఉంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది.

    కుంభ రాశి:
    పెండింగ్ బకాయిలు వసూలవుతాయి. అనారోగ్య సమస్యలు మాయమవుతాయి. ఎవరైనా ఇబ్బంది పెడితే వారికి తగిన బుద్ది చెబుతారు. పిల్లలతో సంతోషంగా గడుపుతారు. ఇతరులకు అప్పు ఇచ్చినట్లయితే వెంటనే రాబట్టుకోవాలి.

    మీనరాశి:
    ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. పిల్లల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులు ఏవైనా కొత్త ప్రయత్నాలు చేస్తే అవి సక్సెస్ అవుతాయి. శత్రువులను జయిస్తారు.