Horoscope lord shiva
Horoscope Today: 2024 జూన్ 17 సోమవారం రోజున ద్వాదశ రాశులపై చిత్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో నిర్జల ఏకాదశి కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉండనున్నాయి. సోమవారం సందర్భంగా కొందరికి శివుడి అనుగ్రహం ఉండనుంది. మేషం నుంచి 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
వైవాహిక జీవితంలో అనూహ్య మార్పులు. ఆర్థికి పరిస్థితి మెరుగుపడడానికి తీవ్రంగా కృషి చేస్తారు. ఉద్యోగులకు సమస్యలు ఎదురవుతాయి. సీనియర్లతో జాగ్రత్తగా ఉండాలి.
వృషభ రాశి:
ఎక్కువగా వాదనలో చేయొద్దు. ఉపాధి విషయంలో కొత్త మార్గాలు ఏర్పడుతాయి. ప్రియమైన వారి నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.
మిథున రాశి:
పెండింగు పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుంది. వ్యాపారులు కొత్త ప్రణాళికలు వేస్తారు. ఇవి లాభాలను తెస్తాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.
కర్కాటక రాశి:
విద్యార్థుల నుంచి శుభవార్తలు వింటారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఏదైనా చర్చల్లో పాల్గొన్నప్పుడు ప్రసంగాన్ని అదుపులో ఉంచుకోవాలి.
సింహారాశి:
ఉద్యోగులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కెరీర్ కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు.
కన్య రాశి:
అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. ఏ పని చేసినా విజయం వరిస్తుంది. వ్యాపారులు కొత్త లాభాలను ఆశిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
తుల రాశి:
ఆదాయం పెరుగుతున్నా.. ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ప్రియమైన వారితో వాగ్వాదం ఉండొచ్చు. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.
వృశ్చిక రాశి:
పెండింగులో ఉన్న బకాయిలు వసూలవుతాయి. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాాయి.
ధనస్సు రాశి:
కొన్ని ప్రసంగాల ద్వారా ప్రజల మద్దతు ఉంటుంది. నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడొచ్చు. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి:
ఉద్యోగులు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. స్నేహితులతో సరదాగా ఉంటారు. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కుంభరాశి:
కుటుంబ సభ్యుల నుంచి గొడవలు రాకుండా చూసుకోవాలి. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. పిల్లలకు సంబందించి శుభవార్తలు వింటారు.
మీనరాశి:
జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. రాజకీయ నాయకుల వారికి ఇతరుల మద్దతు ఉంటుంది.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
View Author's Full InfoWeb Title: Horoscope today due to shiva yoga the income of this zodiac sign will increase today