https://oktelugu.com/

Horoscope Today: గౌరీ యోగం కారణంగా.. ఈ రాశుల వారికి అనుకోకుండా సంపద.. మిగతా రాశుల ఫలితాలు ఎలా ఉన్నారంటే?

ఈ రాశి వ్యాపారులకు అత్యధిక లాభాలు వచ్చే అవకాశం. కష్టపడిన వారికి తగిన ఫలితాలు ఉంటాయి. వివాహ విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : December 18, 2024 / 07:43 AM IST

    Horoscope Today(4)

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉండనుంది. ఇదే సమయంలో గౌరీ యోగం ఏర్పడడంతో కొన్ని రాశుల వారికి అనుకోకుండా సంపద పెరిగే అవకాశం. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. అలాగే మేషంతో సహా మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం

    మేష రాశి: ఈ రాశి వ్యాపారులకు అత్యధిక లాభాలు వచ్చే అవకాశం. కష్టపడిన వారికి తగిన ఫలితాలు ఉంటాయి. వివాహ విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు.

    వృషభరాశి: కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. దీంతో డబ్బు ఖర్చు అవుతుంది. అయితే ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చు చేయాలి. అనారోగ్య సమస్యలు వాటిల్లే అవకాశం. స్నేహితులతో కలిసి సరదాగా ఉంటారు.

    మిథున రాశి: జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారం చేయాలనుకునే వారికి ఇదే మంచి సమయం. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఎవరి వద్దనైనా అప్పు తీసుకుంటే దానిని వెంటనే తీర్చి వేయడం మంచిది.

    కర్కాటక రాశి: రాజకీయ రంగాల్లో పనిచేసే వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సాయంత్రం శుభ కార్యక్రమంలో పాల్గొంటారు. విదేశాల్లో ఉండే విద్యార్థులు ఉన్నత చదువులకు మార్గాలు ఏర్పడతాయి. విహారయాత్రలకు వెళ్తారు.

    సింహా రాశి: బంధువులతో ఏదైనా విభేదాలు ఉంటే ఈ రోజుతో పరిష్కారం అవుతాయి. వ్యాపారులు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాదనలకు దూరంగా ఉండాలి. భాగస్వాములతో కలిసి చేసే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.

    కన్యరాశి: పూర్వీకుల ఆస్తిపై శుభవార్త వింటారు. తల్లిదండ్రులపై ప్రేమను చూపాలి. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఇదే మంచి సమయం.

    తుల రాశి: అనుకోకుండా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపారాలు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. సోదరుడి మద్దతుతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామికి బహుమతిని కొనుగోలు చేసి ఇవ్వచ్చు.

    వృశ్చిక రాశి: కొన్ని ఇష్టమైన పనులు మాత్రమే చేయాలి. మరికొన్ని పనులను వాయిదా వేసుకోవడం మంచిది. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగులు కొత్త బాధ్యతలు చేపడతారు. ఈరోజు కొత్త వ్యక్తిని కలుసుకుంటారు.

    ధనస్సు రాశి: ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కొన్ని కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సాయంత్రం ఇంటికి అతిధులు వచ్చే అవకాశం ఉంది.

    మకర రాశి: ఉద్యోగులు ఇతరులకు ధన సహాయం చేస్తారు. అయితే ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. పిల్లల భవిష్యత్తు కోసం డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇది లాభపడుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పై శ్రద్ధ ఉంచాలి.

    కుంభ రాశి: ప్రత్యర్థులతో వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయంగా వీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. మాటలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు అవుతుంది.

    మీనరాశి: ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వారికి పదోన్నతి లభించే అవకాశం. తల్లిదండ్రుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు.