UPI Customers : ప్రస్తుతం అందరూ విరివిగా ఫోన్ పే, గూగుల్ పే వంటివి వాడుతున్నారు. నెట్ కాష్ వాడటం కంటే ప్రతీ దానికి కూడా ఆన్‌లైన్ పేమెంట్స్ ఎక్కువగా చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఏ వస్తువు అయిన కొనాలంటే ఒకప్పుడు బయటకు వెళ్లేవారు. కానీ ప్రస్తుతం కూర్చున్న ప్లేస్ నుంచే అన్ని కొనుగోలు చేస్తున్నారు. ఎవరికైనా డబ్బులు పంపించాలన్నా కూడా క్షణాల్లో డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. బ్యాంకులకు వెళ్లి కట్టే ఇబ్బంది లేకుండా ఉన్న దగ్గర నుంచే ఇతరులకు పంపిస్తున్నారు. ఇలా కేవలం ఇతరులకు డబ్బులు పంపించడమే కాకుండా.. ప్రతీ చిన్న విషయానికి కూడా యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. అయితే మన అకౌంట్‌లో డబ్బులు ఉంటేనే మనం ఇతరులకు డబ్బులు పంపించవచ్చు లేదా ఏ వస్తువులను అయిన కొనుగోలు చేయవచ్చు. లేకపోతే మీరు ఇతరులకు డబ్బులు పంపిచలేరు. అయితే ఇప్పుడు మీ అకౌంట్‌లో డబ్బులు లేకపోయిన కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు. అది ఎలాగో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
బ్యాంకు నుంచి ఆమోదం పొందిన తర్వాత..
మీ అకౌంట్‌లో డబ్బులు లేకపోతే అత్యవసర పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు వాడుతుంటారు. అయితే యూపీఐ పేమెంట్స్‌లో కూడా ఇలానే ప్రీ శాంక్షన్డ్ క్రెడిట్ లైన్ సౌకర్యాన్ని యూపీఐ వినియోగదారులకు అందించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. ఈ ప్రీ శాంక్షన్డ్ క్రెడిట్ లైన్‌ను గతేడాది సెప్టెంబర్‌లోనే మొదలుపెట్టారు. కానీ ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. ఇకపై షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల్లో కూడా సేవలు అందుబాటులో ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. దీనివల్ల మీ అకౌంట్‌లో డబ్బులు లేకపోయిన కూడా ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు. అయితే ఈ ప్రీ శాంక్షన్డ్ క్రెడిట్ లైన్ సౌకర్యాన్ని పొందాలంటే ముందుగా మీ బ్యాంక్ అకౌంట్‌కు, యూపీఐకి లింక్ ఉండాలి. సేవింగ్స్ ఖాతా గల బ్యాంక్ నుంచి ఆమోదం పొందిన తర్వాత ఓ అప్లికేషన్‌ను బ్యాంక్‌లో సమర్పించాలి. ఆ తర్వాత ఆదాయం, గుర్తింపు, పూర్తి వివరాలు అన్ని కూడా బ్యాంకులో సమర్పించిన తర్వాత ప్రీ శాంక్షన్డ్ క్రెడిట్ లైన్ సౌకర్యం లభిస్తుంది.
ఎలా లింక్ చేసుకోవాలంటే?
ఫోన్‌పే లేదా గూగుల్ ఓపెన్ చేయాలి. హోమ్ బటన్‌లో కుడివైపు చివరలో రౌండ్ బాక్స్ కనిపిస్తుంది. అందులో ఉన్న క్వశ్చిన్ మార్క్‌పై క్లిక్ చే్తే ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ప్రొఫైల్ అండ్ పేమెంట్స్ ఆప్షన్‌పై క్లిక్ చేసి, పేమెంట్స్ మెథడ్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. అప్పుడు మీకు యూపీఐ క్రెడిట్ లైన్ ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే మీకు క్రెడిట్ లైన్ సౌకర్యం ఇచ్చిన బ్యాంకు పేరు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే పిన్ నంబర్‌తో లావాదేవీలు చేయవచ్చు. అయితే ఈ ప్రీ శాంక్షన్డ్ క్రెడిట్ లైన్ పేమెంట్స్ బ్యాంకు బట్టి మారుతుంటాయి. మీ అవసరానికి తీసుకుంటే తర్వాత ఎక్కువ వడ్డీ కట్టాల్సి వస్తుంది. కాబట్టి తీసుకునే ముందు కాస్త ఆలోచించండి.