Linking Rivers: నదుల అనుసంధానం అనేది భారతదేశంలోని నదుల జలాలను పరస్పర అనుసంధానించి, జల వనరులను సమర్థవంతంగా వినియోగించడానికి చేపట్టిన ఒక భారీ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు లక్ష్యం భారతదేశంలోని వివిధ నదుల మధ్య జల ప్రవాహాలను అనుసంధానించడం ద్వారా, నీటి కొరత, వరదలు, మరియు ఇతర జల సంబంధిత సమస్యలను పరిష్కరించడం. దేశంలో ప్రధాన నదులను అనుసంధానంతో తాగు, సాగునీటి అవసరాలు తీరుస్తుంది. కరువు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఈ ఆలోచనతోనే మాజీ ప్రధాని వాజ్‌పేయి నదుల అనుసంధానం అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇందుకు రాష్ట్రాల అనుమతి తప్పనిసరి కావడంతో నాడే ప్రతిపాదనలను రాష్ట్రాలకు పంపించారు. కానీ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. కానీ, తాజాగా మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ నదుల అనుసంధాన ప్రక్రియకు శ్రీకారం చుట్టుబోతోంది.
ప్రధాన లక్ష్యాలు:
నీటి సరఫరా:
విభిన్న ప్రాంతాల్లో నీటి సరఫరా సమస్యలను పరిష్కరించడానికి అనుసంధానాలను రూపొందించడం.
వరద నియంత్రణ:
భారీ వరదల నుండి రక్షణ పొందడం. కొన్ని నదులు ఎక్కువగా వరదలకు గురవుతుంటే, వాటిని ఇతర ప్రాంతాల్లో విడుదల చేయడం ద్వారా వరదలకు నివారణ ఇవ్వచ్చు.
వ్యవసాయం:
పొలాలకు నీటి సరఫరాను పెంచడం, తద్వారా వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం.
జల విద్యుత్ ఉత్పత్తి:
నీటిని తరలించడానికి ఉపయోగించే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి.
పర్యావరణ పరిరక్షణ:
కొన్ని ప్రాంతాల్లో నీటి వనరుల పరిరక్షణతో, పర్యావరణానికి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం.
ముఖ్యమైన నదుల అనుసంధానం..
1. గంగా–గోదావరి అనుసంధానం: గంగా నదిని గోదావరి నదితో అనుసంధానం చేయడం.
2. కావేరి–కృష్ణ అనుసంధానం: కృష్ణ నదిని కావేరి నదితో అనుసంధానం చేయడం.
3. బ్రహ్మపుత్ర–గంగ అనుసంధానం: ఈ ప్రాజెక్టులో బ్రహ్మపుత్ర నదిని గంగా నదితో అనుసంధానించే యోచన ఉంది.
ప్రాజెక్టుకు సంబంధించి వివాదాలు:
పర్యావరణ ప్రభావాలు:
నదుల అనుసంధానం వల్ల పర్యావరణం మీద దుష్ప్రభావాలు ఉంటాయనే ఆందోళనలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో నదుల మార్గం మారిపోవడం వల్ల సహజ వనరులు నష్టం చెందవచ్చు.
ప్రాంతీయ వివాదాలు:
నదుల అనుసంధానం వివిధ రాష్ట్రాల మధ్య వివాదాలకు కారణం కావచ్చు, ఎందుకంటే ప్రతి రాష్ట్రం తమ వాటా కోసం పోరాడుతుంది.
ఆర్థిక భారం:
ఈ ప్రాజెక్టు భారీ ఖర్చును మరియు భవిష్యత్తులో నిర్వహణ సమస్యలను ఎదుర్కొంటుంది.
త్వరలో ప్రారంభం..
నదుల అనుసంధానం ఒక అందమైన ఆలోచన, కానీ దీనిని అమలు చేయడం చాలా కష్టం. పర్యావరణ పరిరక్షణ, ప్రాంతీయ సహకారం, మరియు ఆర్థిక స్థితి వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అయితే రాజస్థాన్‌లోని 11 నదులను అనుసంధానం చేసేందుకు రూ.40 వేల కట్లో విలువైన ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్రమోదీ త్వరలో ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాజస్థాన్‌ను మిగులు నీటి రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్‌లో నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వాటర్ హార్వెస్టింగ్‌కు చర్యలు చేపట్టింది.
కరువు రాష్ట్రం నుంచి..
రాజస్థాన్‌లో తీవ్రమైన నీటి సంక్షోభం ఉంది. ఏటా వేసవిలో నీటి సమస్య తప్పడం లేదు. ఈ రాష్ట్రంలో వర్షాలు కూడా తక్కువే. అయితే ఉన్న నీరు కూడా వృథాగా పోతుంది. దీంతో నదుల అనుసంధానం ద్వారా నీటిని ఒడిసి పట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగానే 11 నదుల అనుసంధానం ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో నీటి మస్యకు చాలా వరకు పరిష్కారం దొరుకుతుంది.
11 నదులు ఇవీ..
నూతనంగా అనుసంధానించే నదుల విషయానికి వస్తే.. చంబల్, దాని ఉప నదులైన పార్వతి, కలిసింద్, కునో, బనాస్, బంగంగా, రూపారెల్, గంభీరి, మేజ్ తదితర నదులు అనుసంధానించనున్నారు. ఈ ప్రాజెక్టుతో ఝాలావర్, బుండి, కోట, టోంక్, సవాయి మాధోపూర్, దౌసా, కరౌలి, గంగాపూర్, భరత్‌పూర్, రాజస్థాన్‌లోని ఆల్వార్, మధ్య ప్రదేశ్‌లోని గుణ, శివపురి, షియోపూర్, సెహూమ్లతో సహా కొత్తగా ఏర్పడిన 21 జిల్లాలకు లబ్ధి చేకూరుతుంది.